- Home
- Entertainment
- Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
నాగ చైతన్య రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు ఇతర హీరోలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. సమంతతో కూడా ఒక సినిమాని నాగ చైతన్య రిజెక్ట్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య ఎంతటి దురదృష్టవంతుడో ఈ మూడు సినిమాల గురించి తెలిస్తే అర్థం అవుతుంది. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్ లో కూడా అలా జరిగింది. అయితే నాగ చైతన్య రిజెక్ట్ చేసిన సినిమాలు ఇతర హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. చైతు గతంలో సమంతతో కూడా ఒక సినిమాని రిజెక్ట్ చేశారు. ఆ సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం.
కొత్త బంగారు లోకం
శ్రీకాంత్ అడ్డాల, వరుణ్ సందేశ్, స్వేత బసు ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీగా యువతని ఉర్రూతలూగించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కట్టిపడేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ చిత్రాన్ని నాగ చైతన్య చేయాల్సింది. చైతూని ఈ మూవీతో హీరోగా లాంచ్ చేయడానికి చర్చలు జరిగాయి. నాగార్జునకి కథ నచ్చింది. అయితే నాగ చైతన్య తొలి చిత్రంలో కాస్త మాస్, స్టైలిష్ అంశాలు కూడా ఉండాలి అని నాగార్జున భావించారు. అందుకే కొత్త బంగారు లోకం చిత్రాన్ని పక్కన పెట్టారు. దీనితో శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని వరుణ్ సందేశ్ తో తెరకెక్కించారు. వరుణ్ సందేశ్ కెరీర్ లోనే కొత్త బంగారు లోకం మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
భలే భలే మగాడివోయ్
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రం ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ఆ టైం నాని కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో నాని, నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అద్భుతం అనే చెప్పాలి. ముందుగా ఈ చిత్రాన్ని మారుతి.. నాగ చైతన్యతో చేయాలని అనుకున్నారు. కానీ ఆ టైంలో చైతు కాస్త సీరియస్ కథలపై ఫోకస్ పెట్టారు. దీనితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని మిస్ చేసుకున్నారు.
అఆ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో అ..ఆ ఒకటి. నితిన్, సమంత జంటగా నటించారు. ఈ మూవీలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. నితిన్ కి కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్. వాస్తవానికి ఈ చిత్రంలో నటించే అవకాశం ముందుగా నాగ చైతన్యకి దక్కింది. చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకనో ఈ చిత్రాన్ని చైతు మిస్ చేసుకున్నారు. డేట్లు అడ్జెస్ట్ కాలేదనే ప్రచారం జరిగింది. చైతు కనుక ఈ చిత్రం చేసి ఉంటే సమంతతో మరో బ్లాక్ బస్టర్ మూవీలో నటించినట్లు అయి ఉండేది.
చైతు వదులుకున్న మరికొన్ని సినిమాలు
కొత్త బంగారు లోకం, భలే భలే మగాడివోయ్, అఆ లాంటి సినిమాలు చైతన్య వదులుకోవడంతో ఇతర హీరోలకు వారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా మారాయి. అయితే చైతు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా రిజెక్ట్ చేశారు. గౌరవం, రిపబ్లిక్, మహా సముద్రం లాంటి సినిమాలని చైతు రిజెక్ట్ చేశారు.

