MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాము రాథోడ్‌ ఒక్క పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? యూట్యూబ్‌ షేక్‌ అయ్యే లెక్కలు

రాము రాథోడ్‌ ఒక్క పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? యూట్యూబ్‌ షేక్‌ అయ్యే లెక్కలు

`రాను బొంబాయికి రాను` పాటతో యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోన్న ఫోక్‌ సింగర్‌ రాము రాథోడ్‌ ఈ పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? ఆ లెక్కలు తెలిస్తే మతిపోవాల్సిందే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 08 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక్క పాటతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిన రాము రాథోడ్‌
Image Credit : starmaa

ఒక్క పాటతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిన రాము రాథోడ్‌

సోషల్ మీడియా కారణంగా ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్స్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా మట్టి వాసన ఉన్న ఒక జానపద(ఫోక్‌ సాంగ్‌)తో కాసుల వర్షం కురిపించిన ఘనత తెలంగాణ జానపద కళాకారుడు రాము రాథోడ్ సొంతం. ఆయన పాడిన `రాను బొంబాయి రాను` పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క పాటతో సెలబ్రిటీ అయిపోయాడు రాము రాథోడ్‌. బిగ్‌బాస్‌ షోలోకి వెళ్లి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఇప్పుడు సరికొత్త పాటలతో సందడి చేస్తున్నాడు.

25
3 లక్షలతో తీసిన `రాను బొంబాయికి రాను` పాట
Image Credit : Jiosaavn

3 లక్షలతో తీసిన `రాను బొంబాయికి రాను` పాట

మరి యూట్యూబ్‌ని షేక్‌ చేసిన `రాను బొంబాయి రాను` పాటకి ఎన్ని వ్యూస్‌ వచ్చాయి? దీనికి ఎంత ఖర్చు చేశాడు? ఎన్నికోట్లు సంపాదించాడనేది చూస్తే మతిపోయే విషయాలు బయటకు వచ్చాయి. సాధారణంగా ఒక సినిమా పాటను నిర్మించాలంటే లక్షలు, కోట్లు ఖర్చవుతాయి. కానీ రాము రాథోడ్ తన టీమ్‌తో కలిసి ఈ పాటను కేవలం 3 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. మొదట వేములవాడలో, ఆ తర్వాత జగిత్యాల సమీపంలోని లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. విడుదలైన కొన్ని నెలల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అయ్యి, ఊహించని రీతిలో వ్యూస్ సాధించింది.

Related Articles

Related image1
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Related image2
Allu Arjun 5 Unknown Truths: అల్లు అర్జున్‌ కి సంబంధించి ఎవరికీ తెలియని 5 సీక్రెట్స్.. ఇవి జరిగాయని అస్సలు ఊహించరు
35
80కోట్ల వ్యూస్‌ సాధించిన రాను బొంబాయికి రాను పాట
Image Credit : youtube/@rathodtunes

80కోట్ల వ్యూస్‌ సాధించిన రాను బొంబాయికి రాను పాట

తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 80 కోట్ల (804 Million) వ్యూస్ మార్కును దాటి, అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు జానపద గీతంగా చరిత్ర సృష్టించింది. ఈ వ్యూస్ ద్వారా కేవలం యూట్యూబ్ యాడ్స్ రెవెన్యూ రూపంలోనే ఈ టీమ్‌కు దాదాపు ఒక కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. రాము రాథోడ్ సంపాదన కేవలం ఒక్క పాటకే పరిమితం కాలేదు. ఈ పాట తెచ్చిన క్రేజ్‌తో ఆయనకు అనేక మార్గాల్లో ఆదాయం సమకూరింది. 80కోట్ల వ్యూస్‌ పొందిన ఈ పాటకిగానూ సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం వచ్చిందట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ పాటకు డాన్స్ చేసిన లిఖిత వెల్లడించింది. ఏడాది క్రితమే కోటి రూపాయలు అంటే, ఇప్పుడు అది రెండు కోట్లు దాటిందని సమాచారం.

45
రాము రాథోడ్‌ సంపాదన
Image Credit : Asianet News

రాము రాథోడ్‌ సంపాదన

అయితే ఈ పాట రాము రాథోడ్‌ లైఫ్‌నే మార్చేసింది. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు. దాని కారణంగా ఆయన కమర్షియల్‌ యాడ్స్ చేస్తున్నాడు. మరోవైపు ఆ మధ్య బిగ్‌ బాస్‌ షోలోనూ పాల్గొన్నారు. ఆ షో నుంచి ఇరవై లక్షలకుపైగానే ఆదాయం పొందాడు. ఇక ఆయన ఒక్క షోగానీ, ఈవెంట్లుగానీ చేస్తే, లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడు. సినిమా పాటలు కూడా వస్తున్నాయి. మొన్న వచ్చిన `బ్యాండ్‌ మేళం` చిత్రంలో `తిప్పూకుంటున్నావ్‌` అనే పాటని రాము రాథోడ్‌ ఆలపించాడు. అదితి భవరాజుతో కలిసి పాడగా ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది.

55
కోట్లు సంపాదిస్తున్న రాము రాథోడ్‌
Image Credit : starmaa

కోట్లు సంపాదిస్తున్న రాము రాథోడ్‌

ఒకప్పుడు సామాన్య జీవితం గడిపిన రాము రాథోడ్, ఈ ఒక్క పాటతో తన తలరాతను మార్చుకున్నారు. `మొదట్లో ఈ పాట ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు. కానీ ప్రేక్షకులు మా కష్టాన్ని గుర్తించారు అని రాము రాథోడ్‌ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్‌ అయ్యాడు. తన సంపాదనతో తన కుటుంబానికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చుకోవడమే కాకుండా, తనలాంటి మరికొంతమంది జానపద కళాకారులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. అదే సమయంలో ఫోక్‌ సాంగ్స్ కి ఊపు తీసుకొచ్చారు. వాటికి మంచి గుర్తింపుని, క్రేజ్‌ని తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు వరుసగా చాలా సినిమాల్లో ఇలాంటి ఫోక్‌ సాంగ్స్ ని పెడుతుండటం విశేషం. మొత్తంగా రాము రాథోడ్‌ `రాను బొంబాయికి రాను` పాటతో రెండు కోట్లకుపైగా సంపాదించాడని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా.. వీరిద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?
Recommended image2
పూజా హెగ్డే టాప్ 5 మూవీస్ ఇవే.. ఫస్ట్ హిట్, లాస్ట్ హిట్ ఆ హీరోతోనే
Recommended image3
LB Sriram: సినిమాలు మానేయడానికి అసలు కారణం అదే.. అతడ్ని దేవుడు శిక్షంచాడు.. టాలీవుడ్ నటుడు
Related Stories
Recommended image1
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Recommended image2
Allu Arjun 5 Unknown Truths: అల్లు అర్జున్‌ కి సంబంధించి ఎవరికీ తెలియని 5 సీక్రెట్స్.. ఇవి జరిగాయని అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved