రామోజీరావుకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? అవి దక్కేది ఎవరి కంటే?
రామోజీరావు ఆస్తుల వివరాలు లెక్క కట్టాలంటే అప్పటికప్పుడు అయ్యే పనికాదు. సుదీర్ఘ వ్యాపార ప్రస్థానంలో ఆయన వేల కోట్లు సంపాదించారు. అసలు రామోజీరావు ఆస్తి విలువ ఎన్ని కోట్లు? అవి ఎవరికి దక్కుతాయో చూద్దాం...

Ramo Rao Dead
రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు పత్రిక స్థాపించాలనే ఆలోచన చేశాడు. ఈనాడు పేరుతో ఆయన స్థాపించిన పత్రిక మొదట్లో కొన్ని నగరాలకే పరిమితం. ఏళ్ల తరబడి కష్టపడి ఈనాడు పేపర్ ని తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన పత్రికగా తీర్చిదిద్దాడు.
అనంతరం సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు. 1983లో ఉషాకిరణ్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించారు. ఈ బ్యానర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం శ్రీవారికి ప్రేమ లేఖ. దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్.
Ramo Rao Dead
తర్వాత 1995లో ఈటీవీ ఛానల్ ప్రారంభించాడు. 1996లో హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించాడు. అప్పటి ప్రభుత్వాలు ఆయనకు అనుకూలంగా వ్యవహరించడంతో వేల ఎకరాలు రామోజీ ఫిల్మ్ సిటీ కోసం సమీకరించగలిగాడు. ఈటీవీ న్యూస్, ఈటీవీ ప్లస్, ప్రియ పచ్చళ్ళు, మార్గదర్శి చిట్ ఫండ్... ఇలా అనేక వ్యాపారాల్లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు.
Ramo Rao Dead
దేశంలోని బడా వ్యాపారవేత్తతో రామోజీ ఒకరు. ఆయన ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంది. వ్యాపారిగా ఎదుగుతున్న క్రమంలో రామోజీ విలువైన ఆస్తులు కొన్నారు. ఒక్క రామోజీ ఫిల్మ్ సిటీ భూములు, ఆస్తుల విలువ లెక్క కడితేనే వేల కోట్లు దాటిపోతాయి.
Ramoji rao Film City
ఒక అంచనా ప్రకారం రామోజీ నికర ఆస్తుల విలువ రూ. 46 వేల కోట్లు. రామోజీ ఫిల్మ్ సిటీ దాదాపు 1666 ఎకరాల్లో విస్తరించి ఉంది. రామోజీ రావుకు ఈటీవి, ఈనాడు పత్రికతో పాటు అనేక ఆస్తులు ఉన్నాయి. డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా రామోజీరావుకు చెందినవే.
Ramo Rao Dead
రామోజీ రావు మరణం నేపథ్యంలో ఈ ఆస్తులు ఎవరికి దక్కుతాయనే వాదన మొదలైంది. రామోజీరావుకు ఇద్దరు కొడుకులు సంతానం. చిన్న కొడుకు సుమన్ 2012లో అనారోగ్యంతో మరణించాడు. సుమన్ నటుడిగా సీరియల్స్ చేశాడు. మరో కొడుకు కిరణ్, ఆయన కోడలు రామోజీరావు వ్యాపారాలు చూసుకుంటున్నారు.
రామోజీరావు గతంలోనే ఇద్దరు కొడుకులకు కొన్ని ఆస్తులు పంచేశాడట. కొంత ఆస్తిని తన పేరు, భార్య పేరున వీలునామా రాశాడట. కాబట్టి... తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తి వారసులకు వస్తుంది కాబట్టి.. కిరణ్, సుమన్ పిల్లలు వేల కోట్ల ఆస్తిని పొందనున్నారు.