రామోజీరావు చివరి కోరిక ఏంటో తెలుసా? చివరికి తీరకుండానే!
మీడియా మొఘల్ గా పేరుగాంచిన రామోజీరావు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సుదీర్ఘ ప్రస్థానంలో అనేక రంగాల్లో రాణించిన రామోజీరావు చివరి కోరిక మాత్రం నెరవేరలేదు.

ఈనాడు పత్రిక స్థాపించి సక్సెస్ అయిన రామోజీరావు నిర్మాతగా మారాలి అనుకున్నారు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కించిన మొదటి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. అప్పటి స్టార్ డైరెక్టర్ జంధ్యాల తెరకెక్కించారు. నరేష్-పూర్ణిమ జంటగా నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ అందుకుంది. మొదటి ప్రయత్నంలోనే రామోజీరావు సక్సెస్ అయ్యారు.
రామోజీ రావు టైర్ టు హీరోలు లేదా కొత్త నటులతో లోబడ్జెట్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపేవారు. సినిమా పోయినా భారీగా నష్టపోకూడదని ఆయన ఆలోచన. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో కూడా చిత్రాలు నిర్మించారు. ఉషా కిరణ్ బ్యానర్ లో వచ్చిన చిత్రం, నువ్వే కావాలి బ్లాక్ బస్టర్స్ అని చెప్పాలి. ఈ చిత్రాలతో ఉదయ్ కిరణ్, తరుణ్ హీరోలుగా పరిచయం అయ్యారు.
ఒక దశకు వచ్చాక రామోజీరావు చిత్ర నిర్మాణం మీద ఆసక్తి వదిలేశారు. ఆ బ్యానర్ లో తెరకెక్కిన చాలా చిత్రాలు ఆదరణ నోచుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన దాగుడుమూతల దండాకోర్ ఉషాకిరణ్ బ్యానర్ లో వచ్చిన చివరి చిత్రం. అయితే ఓటీటీ పై దృష్టి పెట్టి ఒరిజినల్స్ తెరకెక్కిస్తున్నారు. ఈటీవీ విన్ పేరుతో ఓటీటీ సంస్థను స్థాపించారు.
కాగా ఉషాకిరణ్ బ్యానర్ లో 100 సి చిత్రాలు నిర్మించాలి అనేది రామోజీరావు కోరిక అట. కానీ ఇప్పటి వరకు ఉషాకిరణ్ బ్యానర్ లో 60కి పైగా చిత్రాలు తెరకెక్కినట్లు సమాచారం.వంద సినిమాలు రూపొందించాలన్న రామోజీ కల నెరవేరలేదు. ఆ చివరి కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు.
రామోజీరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆయన సేవలకు గుర్తుగా భారతరత్న ఇవ్వాలని స్టార్ డైరెక్టర్ కీరవాణి డిమాండ్ చేశారు.