- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జ్ఞానాంబకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన మల్లిక.. వంటల పోటీకి పయనమైన జానకి, రామచంద్ర!
Janaki Kalaganaledu: జ్ఞానాంబకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన మల్లిక.. వంటల పోటీకి పయనమైన జానకి, రామచంద్ర!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే గోవిందరాజు (Govindaraju) రామచంద్ర దంపతులను పెళ్లికి పంపుదామా అని జ్ఞానాంబ (Jnanamb) ను అడుగుతాడు. ఇక జ్ఞానాంబ కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఇక జానకి దంపతులు వైజాగ్ వెళ్ళకూడదని మల్లిక అటుకులు చిట్టిబాబు అనే వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చి మరి జ్ఞానాంబ కు ఐదు రకాల స్వీట్లు ఆర్డర్ చేయమని చెబుతుంది.
ఇక చిట్టి బాబు (Chittibabu) అనుకున్న విధంగానే జ్ఞానాంబ (Jnanamba) దగ్గరకి వచ్చి ఎల్లుండి మా అమ్మాయి పెళ్లి ఉదయాన్నే ఐదు రకాల స్వీట్లు పంపించండి అని లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఇక జ్ఞానాంబ ఆ ఆర్డర్ ఓకే చేస్తుంది. ఎందుకంటే చిట్టిబాబు ఆడపిల్ల పెళ్లి అని సెంటిమెంట్ తో కొడతాడు.
ఇక ఈ క్రమంలో మల్లిక (Mallika) చిట్టి బాబు సెంటిమెంట్ కి మరింత ఆజ్యం పోస్తుంది. ఇక జ్ఞానాంబ (Jnanamba) మన వల్ల ఆడపిల్ల పెళ్ళికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాడు. కాబట్టి రామచంద్ర పెళ్లి కి వెళ్లకపోయినా ఏం పర్వాలేదు అండీ అని గోవిందరాజు తో అంటుంది. దాంతో గోవిందరాజు మాట పడిపోయినట్లు గా అవుతుంది.
ఆ తర్వాత మల్లిక (Mallika) ప్లాన్ సక్సెస్ అయింది అంటూ నీలావతికి చీరను గిఫ్ట్ గా ఇస్తుంది. మరోవైపు జానకి దంపతులు జ్ఞానాంబ (Jnanamba) ఆర్డర్ ఓకే చేసినందుకు బాధపడుతూ ఉంటారు. ఈలోగా అక్కడకు జ్ఞానాంబ వచ్చి ఏంటి రామా అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది.
ఇక జానకి (Janaki ) ను ఏదన్నా అంటే రామచంద్ర బాధపడతాడు అని మనసులో అనుకుంటుంది. ఇక గోవిందరాజు (Govindaraju) అక్కడకి వచ్చి నీ అంతట నువ్వే పెళ్లికి వెళ్లమని ఇప్పుడు వద్దంటున్నావు ఏంటి? అని అడుగుతాడు. అతను మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించడానికి నేను వాళ్లని పెళ్లికి వద్దన్నాను అని జ్ఞానాంబ అంటుంది.
ఇక తరువాయి భాగం లో మల్లిక (Mallika) జ్ఞానాంబ దగ్గరకు వచ్చి ఆ లక్ష రూపాయలు ఇస్తే నేను చిట్టిబాబు ఇస్తాను అని అంటుంది. ఇక జ్ఞానాంబ (Jnanamba) అతను నీకు తెలుసా అని అడగగా.. నేనే కదా అతడిని పంపించింది అని నోరు జరుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.