- Home
- Entertainment
- Ramayana 6 Days Collections: బాక్సాఫీసు వద్ద రామాయణం గర్జన.. 6వ రోజు దుమారం, అన్ని రికార్డులకు పాతరే
Ramayana 6 Days Collections: బాక్సాఫీసు వద్ద రామాయణం గర్జన.. 6వ రోజు దుమారం, అన్ని రికార్డులకు పాతరే
Ramayana 6 Days Collections: రామాయణం అనే ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన మూవీ `రామాయణం` మూవీ ప్రారంభంలో డల్ గా సాగినా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

రామాయణంలో హైలైట్స్ ఇవే
రామాయణం ఆధారంగా తాజాగా హిందీలో `రామాయణం` చిత్రాన్ని తెరకెక్కించాడు నితేష్ తివారి. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటించారు. నమిత్ మల్హోత్రా, యష్ కలిసి నిర్మించారు.
సుమారు 4వేల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదటి భాగంగా దీపావళి స్పెషల్‌గా నవంబర్ 5న విడుదలైంది. విజువల్ వండర్ ఆకట్టుకుంటోంది. రావణుడి కోణంలో ఈ కథ సాగింది. ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు తెరపై చూపించిన అంశాలను ఇందులో చూపించారు. అవి మూవీకి హైలైట్‌గా నిలిచాయి.
యాక్షన్ బ్లాగ్స్, రావణుడి ఎంట్రీ, లంకలో సూర్పణక భర్తతో పోరాటం, సీతని రావణుడు ఎత్తుకుపోయే సన్నివేశాలు, జటాయు రావణుడితో పోరాటం, రాముడు అడవిలో యాక్షన్ సీన్లు, సీతని కలిసే సన్నివేశాలు, ఆయోధ్యకి రాజుగా పట్టాభిషేకం సమయంలో చోటు చేసుకున్న డ్రామా, రాముడు, సీత వనవాసం వంటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. తెలుగు ఆడియెన్స్ కి రామాయణం కొత్త కాకపోయినా ఇది కొంత కొత్త కోణంలో చూపించడం విశేషంగా చెప్పొచ్చు.
రామాయణం 6 రోజుల కలెక్షన్లు
ఈ సినిమాకి తెలుగులో పెద్దగా ఆదరణ లేదు, కానీ నార్త్ లో బాగా ఆదరిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ బెల్ట్, ఓవర్సీస్ దుమ్మురేపుతోంది. ఇక ఈ చిత్రం ఆరవ రోజు అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. సోమవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గినా, వంద కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇండియాలో ఇది రూ. 112.60కోట్ల గ్రాస్‌ని, రూ.94.10కోట్ల నెట్ కలెక్షన్లని వసూలు చేసింది.
ఓవర్సీస్లో రూ.35కోట్లు రాబట్టింది. ఆరు రోజుల్లో ఈ మూవీకి ఇండియా వైడ్‌గా రూ.526.50కోట్ల గ్రాస్, రూ.440.45కోట్ల నెట్‌ని రాగా, ఓవర్సీస్లో రూ.297కోట్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.823.50కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్ వెల్లడించింది.
ఇదే జోరుచూపిస్తే అన్ని రికార్డులు బ్రేక్
సినిమా జోరు చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా `బాహుబలి 2, `ధురంధర్ 2`, `పుష్ప 2` చిత్రాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా `దంగల్` ఉంది. రామాయణం వాటి రికార్డులను బ్రేక్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే మరి ఇదే జోరు చూపిస్తుందా? డౌన్ అవుతుందా అనేది చూడాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.2000-2500కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌గా చెబుతున్నారు. అంటే ఇంకా రూ.1200-1700కోట్ల వరకు రాబట్టాలి. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి. తెలుగులో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.46కోట్లు చేసింది. ఆరో రోజు 4 కోట్లు రాబట్టింది. తెలుగులో వసూళ్లు తగ్గుతుండటం గమనార్హం.













