- Home
- Entertainment
- Ramayana Collection Day 3: రామాయణ బాక్సాఫీస్ వద్ద భారీ కంబ్యాక్.. మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Ramayana Collection Day 3: రామాయణ బాక్సాఫీస్ వద్ద భారీ కంబ్యాక్.. మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Ramayana Collection Day 3: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన 'రామాయణ: పార్ట్ వన్' బాక్సాఫీస్ దగ్గర సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. శుక్రవారం తగ్గిన కలెక్షన్స్ శనివారం భారీగా పెరిగాయి. ఈ మూడో రోజు కలెక్షన్లతో సినిమాకు కొత్త ఊపు వచ్చింది.

రామాయణ కలెక్షన్స్
రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), రవి దూబే (Ravie Dubey), యశ్ (Yash) నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'రామాయణ: పార్ట్ వన్' (Ramayana: Part One) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. రిలీజ్ రోజున మంచి ఓపెనింగ్స్ వచ్చినా, శుక్రవారం కలెక్షన్స్ తగ్గడంతో ట్రేడ్ వర్గాల్లో కాస్త టెన్షన్ మొదలైంది. అయితే శనివారం థియేటర్లకు జనాలు భారీగా రావడంతో కలెక్షన్స్ అమాంతం పెరిగాయి.
నితీష్ తివారీ (Nitesh Tiwari) డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 5 గురువారం రిలీజ్ అయింది. బంపర్ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ దీపావళికి ముందు రిలీజ్ కావడం కలెక్షన్స్ పరంగా కాస్త ఛాలెంజింగ్ అని చెబుతారు. అందులోనూ శుక్రవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ తగ్గాయి. దీంతో ట్రేడ్ విశ్లేషకులు కొంచెం ఆందోళన చెందారు. అయితే శనివారం వసూళ్లలో భారీ జంప్ సినిమాకు కొత్త స్పీడ్ ఇచ్చింది. సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడేవాళ్లకు ఈ కలెక్షన్లే గట్టి సమాధానం చెప్పాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
మూడో రోజే రూ.69 కోట్లు!
Sacnilk రిపోర్ట్ ప్రకారం, శనివారంవరకు 'రామాయణ' ఇండియాలో ఒకే రోజు రూ.69.80 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. వివిధ భాషల్లో సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి:
హిందీ: 18,848 షోల ద్వారా రూ.53 కోట్లు
కన్నడ: 907 షోల ద్వారా రూ.6.31 కోట్లు
తెలుగు: 1,556 షోల ద్వారా రూ.6 కోట్లు
తమిళం: 654 షోల ద్వారా రూ.2.50 కోట్లు
ఈ లెక్కల ప్రకారం, శనివారం నాటికి సినిమా టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ రూ.182.70 కోట్లకు చేరింది. ఇండియాలో టోటల్ గ్రాస్ రూ.218.25 కోట్లు అని రిపోర్ట్ తెలిపింది.
దీపావళి ప్రభావం ఎంత వరకూ ఉంటుంది?
శనివారం కలెక్షన్స్ పెరిగినట్లే ఆదివారం కూడా మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. ఆదివారం ఇండియాలో రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా. కానీ దీపావళి పూజల వల్ల సాయంత్రం, రాత్రి షోలకు ఆడియెన్స్ కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆదివారం ఫైనల్ కలెక్షన్స్‌పై పండుగ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
ఇక సోమవారం నుంచి బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో మరింత భారీ జంప్ ఉంటుందని ఆశిస్తున్నారు. వీక్ స్టార్టింగ్ లో వచ్చే రెస్పాన్స్ పైనే 'రామాయణ' తదుపరి బాక్సాఫీస్ రన్ ఆధారపడి ఉంటుంది.













