MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆదిపురుష్ టీజర్ సీతకి కూడా నచ్చలేదుగా.. అతను మొఘలుల రావణుడేమో అంటూ చురకలు

ఆదిపురుష్ టీజర్ సీతకి కూడా నచ్చలేదుగా.. అతను మొఘలుల రావణుడేమో అంటూ చురకలు

లెజెండ్రీ డైరెక్టర్ రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సిరీస్ ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ సిరీస్ లో సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియా ఆదిపురుష్ టీజర్ పై స్పందించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'ఆదిపురుష్'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. ప్రేక్షకుల్ని, అభిమానులని టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పాలి. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ లో విజువల్స్ చూస్తుంటే ఇది యానిమేటెడ్ మూవీని తలపిస్తోంది. 

26

అసలు ఓం రౌత్ తెరకెక్కిస్తోంది రామాయణమేనా అనే అనుమానం కలగక మానదు.  టీజర్ లో శ్రీరాముడు ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. ఇక రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ లుక్ అయితే దారుణంగా ఉంది. మన ఊహల్లో ఉండే రావణుడు వేరు.. ఓం రౌత్ చూపించిన రావణుడు వేరు. హాలీవుడ్ చిత్రాల్లో విలన్ తరహాలో రావణాసురుడిని చూపించారు. మరికొందరు అయితే రావణుడు ఏంటి ముస్లిం గెటప్ లో ఉన్నాడు అంటూ మండి పడుతున్నారు. 

36

ఓం రౌత్ మాత్రం.. టీజర్ ని మొబైల్ స్క్రీన్స్ లో చూసి కామెంట్స్ చేయొద్దని తాను ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ కోసం తెరకెక్కించానని కవర్ డ్రైవ్ లు ఏసుకుంటున్నాడు. కానీ సెలెబ్రిటీలని సైతం ఆదిపురుష్ టీజర్ నిరాశకి గురిచేస్తోంది. 

46

లెజెండ్రీ డైరెక్టర్ రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సిరీస్ ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ సిరీస్ లో సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియా ఆదిపురుష్ టీజర్ పై స్పందించారు. టీజర్ లో రావణాసురుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ లుక్ పై ఆమె సెటైర్లు వేశారు. 

56

ఈ రావణాసురుడు శ్రీలంకకు చెందిన వాడు కాదేమో.. బహుశా అతను మొఘలుల రావణాసురుడు అయి ఉంటాడు అంటూ విమర్శలు చేసింది. అలాగే వాల్మీకి, తులసీదాస్ తమ రచనలతో అద్భుతమైన రామాయణ చరిత్రని అందించారు. ఆ రామాయణంకి గ్రాఫిక్స్ తో పనిలేదు అని దీపికా అన్నారు. ఆదిపురుష్ టీజర్ చూశాను. రామాయణాన్ని గ్రాఫిక్స్ తో ముడిపెట్టొద్దు అని అన్నారు. 

66

హనుమంతుడి పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. కానీ నేను టీజర్ సరిగ్గా చూడలేదు. రామాయణంని గ్రాఫిక్స్ మయం చేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. ఆదిపురుష్ టీజర్ తో చాలా డ్యామేజ్ జరిగింది. మరి చిత్ర యూనిట్ దీనిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
నా కొడుకు చిరంజీవికి అభిమాని, మా మధ్య చిచ్చు పెట్టాలని చూసింది వాళ్లే.. మోహన్ బాబు కామెంట్స్
Recommended image2
Nagarjuna, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? ఆ స్టార్‌ డైరెక్టర్‌ వల్లే
Recommended image3
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved