- Home
- Entertainment
- Janaki Kalaganeledu: తన అత్తయ్య తనను వేధిస్తుందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన జానకి.. షాకైన జ్ఞానంబ!
Janaki Kalaganeledu: తన అత్తయ్య తనను వేధిస్తుందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన జానకి.. షాకైన జ్ఞానంబ!
Janaki Kalaganeledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganeledu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

యోగి.. రామచంద్ర (Rama Chandra) తో మిమ్మల్ని ఇలా ఇంట్లో నుంచి పంపించడం హింసించడం కాక ఇంకేంటి అని అడుగుతాడు. దాంతో రామచంద్ర ఏం కూసావు రా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి యోగి (Yogi) చొక్కా కాలర్ పట్టుకుంటాడు. ఇక ఈ లోపు జానకి ఇద్దరిని విడదీస్తుంది.
అదే క్రమంలో జానకి (Janaki) నువ్వు మా అత్తయ్య గారి గురించి అనడానికి సరిపోవు అని యోగి తో అంటుంది. ఇక రామచంద్ర కూడా యోగిని కొట్టడానికి ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు. కానీ జానకి వాళ్ళిద్దర్నీ విడదీస్తుంది. ఇక రామచంద్ర (Rama chandra) గంటలో మా అమ్మ ఇక్కడ ఉండకపోతే నేనేం చేస్తానో మీ ఊహకే వదిలేస్తున్నాను అని అంటాడు.
అంతేకాకుండా రామచంద్ర (Rama Chandra) టైం లిమిట్ పెట్టుకో యోగి.. గంట దాటితే రాముడు రావణాసురుడు అయిపోతాడు అని అంటాడు. ఇక యోగి మాత్రం కేసు వెనక్కి తీసుకోవడం జరగని పని అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామచంద్ర మా అమ్మ స్టేషన్ కి వెళ్లడానికి కారణం నువ్వే అని జానకి (Janaki) ను అపార్ధం చేసుకుంటాడు.
మరోవైపు స్టేషన్ దగ్గర మల్లిక (Mallika) పోలేరమ్మ పోలీస్ స్టేషన్ కి రావడానికి ఒక రకంగా మనం చేసిన కుట్రే కారణమని మురిసిపోతుంది. ఇక స్టేషన్ లో జ్ఞానాంబ ను ఉంచి ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని బయటకు ఈడ్చుకొని వెళతారు పోలీసులు. ఆ తర్వాత జానకి యోగి కి తన అత్తగారి గొప్పతనం వివరించి యోగి (Yogi) కి అర్థమయ్యేలా గ్రహింప చేస్తుంది.
ఆ క్రమంలో యోగి (Yogi) నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు నేను విడాకులు ఇప్పించేసి మాతో పాటు అమెరికా తీసుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను అని అంటాడు. దాంతో ఒక్కసారిగా జానకి (Janaki) గుండె ఆగిపోయినట్టు చూస్తుంది.
ఇక యోగి (Yogi) తో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానకి మా అత్తయ్య గారు నన్ను ఎన్నో కష్టాలు పెట్టారు. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు అని ఎస్ఐకి స్టేట్మెంట్ ఇస్తుంది. దాంతో రామచంద్ర (Ramachandra) ఆశ్చర్యపోతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.