- Home
- Entertainment
- janaki Kalaganaledu: రామాను వంటల పోటీకి పంపించాలనుకున్న జానకి.. కుదరదని షాకిచ్చిన జ్ఞానాంబ!
janaki Kalaganaledu: రామాను వంటల పోటీకి పంపించాలనుకున్న జానకి.. కుదరదని షాకిచ్చిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జానకి (Janaki) ఇంటికి రాగా జ్ఞానాంబ (Jnanamba) మల్లిక చెప్పేదంతా నిజమేనా అని జానకి ను అంటుంది. అంతేకాకుండా మళ్లీ ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాలని చూస్తున్నావా అని అడుగుతుంది. ఇక దానికి ఫోటో ప్రేమ్ ఆర్డర్ ఇచ్చాను దాని కోసం వెళ్లాను అని చెబుతోంది.
దాంతో ఫ్యామిలీ అంతా ఆ ఫోటో ని చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక జ్ఞానాంబ (Jnanaamba) ఇంకోసారి లేనిపోని చాడీలు చెప్పావంటే మర్యాదగా ఉండదు అని మల్లిక పై విరుచుకు పడుతుంది. మీరు గొడవ పడ్డారు అన్న కారణంతో ఆ కన్నబాబు మరి ఇంటికి వచ్చి గొడవ చేస్తే పరిస్థితి ఏమిటి అని రామ చంద్ర జానకి (Janaki) తో అంటాడు.
ఇక జానకి (Janaki) అతనికి వచ్చే ధైర్యం లేదని అంటుంది. ఇక జానకి సమస్య గురించి భయపడొద్దు రామాగారు దాన్ని ఎదుర్కొనే ఆలోచన చేయండి అని ధైర్యం చెబుతుంది. మరోవైపు మల్లిక (Mallika) మీ అన్నయ్య వదిన అత్తయ్య గారికి తెలియకుండా ఎదో గూడు గూటని నడుపుతున్నారు అని చెబుతుంది.
ఆ తర్వాత మల్లిక (Mallika) భర్త మల్లిక ఊరికి పోయిందంటూ ఆనందంగా స్టెప్పులు వేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నా భార్య నన్ను వెతుకు తింటుంది వదిన అంటూ మల్లికా భర్త జానకి (Janaki) తో చెబుతాడు. ఇక జానకి తనతో నువ్వు మంచిగా ఉండాలి ఇంకెప్పుడు తను ఊరు వెళుతుంది అని సంతోషపడకు అని అంటుంది.
మరోవైపు రామచంద్ర (Ramachandra) జానకి బండి మీద వెళుతూ ఉండగా అక్కడ నేషనల్ చెఫ్ కాంపిటీషన్స్ యాడ్ జానకి (Janaki) చూస్తుంది. అది గమనించిన జానకి రామచంద్ర ఎలాగైన ఆ పోటీలో పాల్గొనే లా చేయాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు అని అనుకుంటుంది.
ఇక జానకి (Janaki) జాతీయ చెఫ్ కాంపిటేషన్ జరుగుతుంది ఆ పోటీలో రామచంద్ర గారు పాల్గొంటే తప్పకుండా గెలుస్తారు అని జ్ఞానాంబ (Jnanamba) తో చెబుతుంది. ఇక జ్ఞానాంబ ఒద్దు అని జానకి మాట తిరస్కరిస్తుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.