Janaki Kalaganaledu: ఎట్టకేలకు వంటల పోటీల్ గెలిచిన రామచంద్ర.. ఆనందంలో జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ కోసం అందరు ఎదురు చూస్తున్న కూడా ఆమె ఎంత సేపటికి రాదు. అప్పుడు జడ్జ్ మరొక 5 నిముషాలు టైమ్ ఇస్తున్నాము ఆ లోపు రాకపోతే ఎలిమినేట్ చేస్తాము అని చెప్పడంతో జానకి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు జ్ఞానాంబ బయటకి రాకుండా ఉండాలి అని ఆమె గది బయట గడియ పెడతారు.
అప్పుడు జ్ఞానాంబ రూమ్ లో నుంచి బయటకు రావడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జానకి హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేయగా ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో మరింత కంగారు పడుతుంది. జానకి టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు కన్నబాబు, సునంద ఆనంద పడుతూ ఉంటారు.
ఇక రామచంద్రకు ఇచ్చిన సమయం పూర్తి అవ్వడంతో కాంపిటీషన్ నుంచి వెళ్ళిపోవచ్చు అని జడ్జీలు చెబుతారు. అప్పుడు రామచంద్ర కాంపిటీషన్ లో కళ్ళు తిరిగి పడిపోగా, మరోవైపు రూములో జ్ఞానాంబ కూడా కళ్లు తిరిగి పడిపోతుంది. ఇంకా ఆ తర్వాత కోలుకున్న రామచంద్ర జానకి ఎంత చెబుతున్నా కూడా వినకుండా వంటలు చేయడానికి సిద్ధపడతాడు.
తన చేతికి ఉన్న కట్టును విప్పేసి బలవంతంగా వంటలు చేయడం మొదలుపెడతాడు. మరొకవైపు జ్ఞానాంబ గది ముందు క్లీన్ చేస్తున్న ఒక వ్యక్తి గదిలో ఎవరో ఉన్నారు అని చెప్పి వెంటనే తాళం తెచ్చి ఆ డోర్ లాక్ జ్ఞానాంబ పరుగుపరుగున అక్కడికి వెళ్లి పోతుంది.
రామచంద్ర కష్టాన్ని చూసి జ్ఞానం బాధపడుతూ ఉంటుంది. అలా చివరికి అనుకున్న విధంగా రామచంద్ర పూతరేకులు చేస్తాడు. ఇక పూతరేకులను చేసిన జడ్జీలు బాగుంది అని చెప్పి విజేతగా ప్రకటించి 5 లక్షల రూపాయలు ఇస్తారు. దాంతో కన్నబాబు సునంద కోపంతో రగిలి పోతూ ఉంటారు. ఐదు లక్షల డబ్బులు రామచంద్ర తన తల్లి చేతుల మీదుగా అందుకుంటాడు.