Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకిని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రామచంద్ర జానకి?

Janaki Kalaganaledu: జానకిని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రామచంద్ర జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 1 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

Navya Reddy | Published : Dec 01 2022, 11:51 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఈరోజు ఎపిసోడ్ లక్షపత్రి పూజ చేసినందుకు చెయ్యి అంత నొప్పిగా ఉంది అని జ్ఞానాంబని తిట్టుకుంటూ ఉంటుంది మల్లిక. అఖిల్ అరెస్టు విషయాన్ని అడ్డుపెట్టుకొని జానకిని ఎలాగో అలా ఇరికించొచ్చు అనుకుంటే అఖిల్ ని బయటకు తీసుకుని వచ్చి జానకి మరిన్ని మార్కులు కొట్టేసింది అనుకుంటూ కుళ్లుకుంటూ ఉంటుంది మల్లిక. ఇంతలోనే అక్కడికి పనిమనిషి చికిత వస్తుంది. అప్పుడు చికిత మల్లిక మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది. అయినా మీకు పదేపదే చేసిన ఫ్యామిలీ వేయడం బోర్ కొట్టడం లేదా అమ్మగారు అని అనగా నా ఇష్టమే నా ఇష్టం అని అంటుంది.
 

26
Asianet Image

అందుకే అమ్మగారు మీరు చేసిన ప్లాన్ లు అన్ని రివర్స్ అవుతున్నాయి అని అంటుంది చికిత. పైన దేవుడనే వాడు ఉన్నాడు దేవుడు మంచి వైపే ఉన్నాడు అని అంటుంది చికిత. అప్పుడు సర్లే అమ్మగారు బయటకు వచ్చి పొట్ట పూజ చేద్దురు రండి అంటూ జోకులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చికిత. మరొకవైపు రామచంద్ర జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా చేసి జానకి గారిని కాలేజీకి పంపించాలి లేకపోతే ఇంట్లో అందరికీ తెలిస్తే అమ్మ నాన్నలు బాధపడతారు అని అనుకుంటూ ఉంటారు రామచంద్ర. అప్పుడు జానకి అక్కడికి వచ్చి పనిమనిషి చికితని ఆట పట్టిస్తూ ఉంటుంది.
 

36
Asianet Image

తర్వాత జానకి లోపలికి వెళ్లి కాఫీ  చేస్తుండగా రామచంద్ర మంచి సమయం జానకి తో మాట్లాడాలి అనుకుంటూ ఉండగా అప్పుడు రామచంద్రని జ్ఞానాంబ పిలుస్తుంది. అప్పుడు జ్ఞానాంబని భాను ఫోన్ చేసింది ఒకసారి రమ్మని చెప్పింది నిన్ను చూడాలనిపిస్తోందట అని అనగా భాను ఎవరో అత్తయ్య గారు అని జానకి అడగగా అప్పుడు రామచంద్ర అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అని చెబుతాడు. అప్పుడు జ్ఞానాంబని ఈరోజు భాను దగ్గరికి వెళ్లి రా అని అనగా సరే అమ్మ అని అనడంతో నేను కూడా వెళ్తాను అత్తయ్య అని అంటుంది జానకి. సరే వెల్లమ్మ అని చెప్పడంతో సంతోషంతో వాళ్ళు బయలుదేరగా మల్లిక అది చూసి కుళ్లుకుంటూ ఉంటుంది.

46
Asianet Image

అప్పుడు అత్తయ్య గారు నేను కూడా వెళ్తాను అని మల్లిక అనగా వెంటనే గోవిందరాజులు విష్ణు ఏదో పనిమీద ఉన్నాడు వాని పని ఎందుకు చెడగొడతావు అంటూ మల్లిక మీద సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత జానకి వాళ్ళు బయలుదేరుతుండగా జానకి కారులో కాకుండా బైక్ లో వెళ్దాం అనడంతో సరే అని వెళ్దాం పదండి అంటాడు రామచంద్ర. అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లికా లోపలికి వెళ్లి ఒక ముద్దు లేదు ముచ్చట లేదు ఎక్కడికి వెళ్ళలేదు అని కుళ్ళుకుంటూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి విష్ణు వస్తాడు. నన్ను పట్టించుకోవడం లేదు నన్ను కాకుండా ఎక్కువగా షాప్ కు వెళ్తున్నారు అని దొంగ ఏడుపులు ఏడుస్తుండగా అసలు ఏం జరిగింది చెప్పు మల్లిక అని అంటాడు విష్ణు.
 

56
Asianet Image

అప్పుడు మల్లిక జరిగిన విషయం చెప్పడంతో నువ్వు గర్భవతి కదా అందుకే అమ్మ వద్దని ఉంటుంది అర్థం చేసుకో అని అనడంతో మల్లిక దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. సరే నీ ఏడుపు మానాలి అంతే ఏం చేయాలో చెప్పు అని అనడంతో నేను అడిగిన తర్వాత మళ్లీ మీరు కాదనకూడదు అని అంటుంది మల్లిక. అప్పుడు బిర్యానీ కావాలని అడగడంతో నువ్వు బిర్యాని కోసమే కదా ఇంత ఓవరాక్షన్ చేశావు అని అంటాడు విష్ణు. బిర్యానీ కావాలి అంతే కదా నేను సాయంత్రం వచ్చినప్పుడు తీసుకొస్తాను అనడంతో మల్లిక సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు రామచంద్ర జానకి ఇద్దరు బైక్ లో వెళ్తూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

66
Asianet Image

ఇప్పుడు జానకి రామచంద్ర అక్కడున్న చుట్టూ వాతావరణన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జానకి అక్కడ పంట వాతావరణంలో పూలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటుంది. తర్వాత ఇద్దరూ బైక్ లో వెళ్తూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జానకి మళ్ళీ బైక్ దిగి వరి చేనులోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉండగా రామచంద్ర అక్కడి నుంచి పిలుచుకుని వెళ్తాడు. ఆ తరువాత వాగులు వంకలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది జానకి.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories