MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జెస్సి కడుపులో బిడ్డపై ఆశలు వదులుకోమని చెప్పిన డాక్టర్.. సంతోషంలో జ్ఞానాంబ?

Janaki Kalaganaledu: జెస్సి కడుపులో బిడ్డపై ఆశలు వదులుకోమని చెప్పిన డాక్టర్.. సంతోషంలో జ్ఞానాంబ?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 12వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 13 2022, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో జ్ఞానాంబ దంపతులు గుడికి వెళ్లి పూజ చేయిస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరు జరిగిన విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. నువ్వు ఎక్కువ బాధపడకు జ్ఞానం నువ్వే ఇలాగ ఉంటే విష్ణువుకి సరిది చెప్పలేవు అని అనగా వెంటనే జ్ఞానాంబ ఎంత నచ్చ చెప్పాలి అనుకున్న నావల్ల కావడం లేదండి మొదటి బిడ్డ మీద ఆశలు ఎక్కువగా పెట్టుకున్నట్టున్నాను. అందుకే ఇలా బాధపడుతున్నాను అని అంటుంది. ఇంతలోనే ఒక ఆమె అక్కడికి వచ్చి జ్ఞానాంబ గారు బాగున్నారా అని చెప్పి మనవడు పుట్టాడు అందుకే ప్రసాదం పంచుతున్నాను అని చెప్పి వెళ్లడంతో జ్ఞానాంబ వాళ్ళు మరింత బాధపడుతూ ఉంటారు.
 

27

అందరిని కరుణిస్తున్న ఆ దేవుడు నేను ఏం పాపం చేశాను నాకు ఇలా శిక్ష వేస్తున్నారు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది జ్ఞానాంబ. ఇంతలోనే పంతులుగారు అక్కడికి వచ్చి అసలు విషయం తెలుసుకొని ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిపించండి అంతా మంచి జరుగుతుంది అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ  నా కోడలికి ఇంకా నెలలు నిండలేదు అనగా ఆ నెలలో నిండడం అన్నది వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం ఉంటుంది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనడంతో జ్ఞానాంబ సంతోష పడుతూ ఉంటుంది. ఆ తరువాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
 

37

మరొకవైపు జానకి వాళ్ళు డాక్టర్ దగ్గరికి జెస్సి ని తీసుకొని వెళ్తారు. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తుంది. అప్పుడు జెస్సి నీ బయటికి వెళ్ళమని చెప్పగా వెంటనే జానకి డాక్టర్ గారు ముందు చెప్పిన మాదిరి కాకుండా అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కడుపులో బిడ్డ చాలా వీక్ గా ఉంది ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనడంతో జానకి రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతేకాకుండా తన బిడ్డ పై ఆశలు వదులుకోండి అని అనగా జానకి అలా మాట్లాడకండి డాక్టర్ గారు అని అంటుంది.
 

47

మరొకవైపు జెస్సి ఫోన్లో పిల్లల ఫోటోలు చూసి మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత జానకి వాళ్ళు జెర్సీ దగ్గరికి వెళ్తారు. అక్క డాక్టర్ గారు ఏం చెప్పారు కడుపులో బిడ్డ బాగానే ఉందా అని అడుగుతుంది. అప్పుడు జెస్సికి అబద్దం చెబుతుంది జానకి. అప్పుడు జానకి రామచంద్ర జెస్సీ తనకు పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అనుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు రామచంద్ర ఎలా అయినా అమ్మకు మొదటి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు జ్ఞానాంబ వాళ్ళు ఇంటికి వస్తారు.
 

57

అప్పుడు జెస్సీని పిలుస్తుండగా వెంటనే పనిమనిషి చికిత వాళ్ళు లేరు అమ్మగారు జానకమ్మ గారు వాళ్ళు హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు అని అంటుండగానే ఇంతలోనే రామచంద్ర వాళ్ళు వస్తారు. అప్పుడు రామచంద్ర జానకి ఇప్పుడే అత్తయ్య గారికి చెప్పకపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జ్ఞానాంబ నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అని అనగా ఎందుకమ్మ అని అనడంతో నేను చెప్తాను మొదట మీరు డాక్టర్ గారు ఏం చెప్పారు అది చెప్పండి అని అంటుంది జ్ఞానాంబ. అంత బాగానే ఉందని చెప్పారు నాన్న అని అబద్ధం చెబుతాడు రామచంద్ర. దాంతో జ్ఞానాంబ  వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు.
 

67

అప్పుడు జ్ఞానాంబ జెస్సికి సీమంతం చేద్దాం అనుకుంటున్నాను అనడంతో రామచంద్ర,జానకి షాక్ అవుతారు. అప్పుడు ఆ మాటలు విన్న మల్లిగా నేను అనవసరంగా ముందుగానే ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్నాను. ఫంక్షన్ జరిగి ఉంటే నాకు డబ్బులు కూడా వచ్చేవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి వద్దు అత్తయ్య గారు ఇప్పుడే అని అనగా లేదు జానకి జెస్సికి శ్రీమంతం జరిపిద్దాము అని అంటుంది. రేపే జెస్సిమీ శ్రీమంతం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు జ్ఞానాంబ దంపతులు. ఆ తర్వాత రామచంద్ర బయటికి వెళ్లి జరిగిన విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
 

77

 అప్పుడు డాక్టర్ అన్న మాటలు పదేపదే తలుచుకుని బాధపడుతూ ఉంటాడు రామచంద్ర. రామచంద్ర, జానకి ఇద్దరు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. రామచంద్ర జానకి ఈ నిజం ఎప్పటికీ అత్తయ్య కు జెస్సికి అసలు తెలియకూడదు ఏం జరగాలో అది జరుగుతుంది మీరేం భయపడకండి అని ఓదార్పునిస్తుంది జానకి. ఆ తర్వాత జ్ఞానాంబ జెస్సి వాళ్ళ అమ్మానాన్నలకు ఫోన్ చేసి రేపు జెస్సీకి శ్రీమంతం చేస్తున్నాము మీరు రండి అని చెప్పడంతో చేసి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు జెస్సి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ లేదు కేరళకి వెళ్ళింది అని అనడంతో మేము రేపే పెట్టుకున్నాము మరి ఎలా అని అంటుంది జ్ఞానాంబ. పర్లేదు మీరు ఎప్పుడైనా పెట్టుకోండి అని అంటాడు జెసి వాళ్ళ నాన్న.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image3
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved