- Home
- Entertainment
- Janaki Kalaganaledu: అడుగడుగునా రామచంద్రకు ఎదురుదెబ్బలు.. చెఫ్ కాంపిటీషన్‌కు వచ్చిన అరియనా!
Janaki Kalaganaledu: అడుగడుగునా రామచంద్రకు ఎదురుదెబ్బలు.. చెఫ్ కాంపిటీషన్‌కు వచ్చిన అరియనా!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రామచంద్ర (Rama Chandra) దగ్గర తిన్న పాయసాన్నికి ఆ దంపతులు 500 రూపాయలు ఇవ్వడంతో.. ఇక మిగిలిన టూరిస్టులు అంతా ఆ పాయసాన్ని ఎగబడి మరీ కొంటారు. దాంతో గోవిందరాజు (Govindaraju) దంపతులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంటారు.
ఇక మహేష్ (Mahesh) ఆ రౌండ్లో ఐదవ విజేతగా రామచంద్ర (Rama Chandra)ను సెలెక్ట్ చేస్తాడు దాంతో ఫ్యామిలీ మొత్తం స్థాయిలో సంతోష పడుతూ ఉంటారు. మరోవైపు కన్నబాబు వాళ్ళ అమ్మ కలిసి..జ్ఞానాంబ ఇంటికి వెళతారు. ఇక కన్నబాబు రామచంద్ర ఎక్కడ ఉన్నాడు అని మల్లిక ను అడుగుతాడు.
ఇక మల్లిక మా బావ నేషనల్ మాస్టర్ చెఫ్ పోటీలకు హైదరాబాద్ కి వెళ్ళాడు. ప్రస్తుతం సెమీఫైనల్ లో ఉన్నాడు. రేపోమాపో ఫైనల్లో గెలిచి ఇంటికి ఐదు లక్షలతో బహుమతి తో తిరిగి వస్తాడు అని అంటుంది. దాంతో కన్నబాబు తన తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
ఇక కన్నబాబు తల్లి.. రామచంద్ర (Rama Chandra) ఫైనల్లో గెలవ కూడదు మన అప్పు వాడు తీసుకోకూడదు అని అంటుంది. మరోవైపు జానకి (Janaki) రామచంద్ర కోసం ఒక వాచ్ గిఫ్ట్ గా తెచ్చి తనే స్వయంగా రామచంద్ర నా కళ్ళు మూసుకో అని చెప్పి తన చేతికి వాచ్ తోడుగుతుంది. దానికి రామచంద్ర ఎంతో ఆనందంగా సంతోషిస్తూ ఉంటాడు.
ఇక చెఫ్ కాంపిటేషన్ ఫోటీలకు కన్నబాబు (Kannababu) తన తల్లి కూడా వస్తారు. మీ అబ్బాయి రామచంద్ర (Rama Chandra) కోసం వచ్చాను అని కన్నబాబు తల్లి జ్ఞానాంబ కు చెబుతుంది. ఇక మన ఊరు నుంచి వచ్చి ఎంత పెద్ద పోటీల్లో పాల్గొనడం నాకు చాలా గర్వంగా అనిపించింది అని అంటుంది. ఇక సెమీ ఫైనల్స్ లో భాగంగా గెస్ట్ గా అరియనా గ్లోరీ ను కూడా ఇన్వైట్ చేస్తారు.
ఆ తర్వాత పోటీల్లో పాల్గొన్న పాటిస్పేట్ కి బెస్ట్ ప్రభాస్ ప్రభాస్ జడ్జ్ ప్రభా రమేష్ (prabha Ramesh) అందరినీ చాలా ప్రోత్సహిస్తుంది. ఇది నా వల్ల అవుతుందా అనే ఆలోచనతో కాకుండా.. నా వల్ల ఎందుకు కాదు అనే నమ్మకంతో ఈ పోటీని ట్రై చేయండి అని వాళ్లతో ధైర్యం వాళ్ళల్లో ధైర్యం నింపుతుంది. ఆ తర్వాత సంజయ్ (Sanjay) స్పెషల్ నాన్ వెజ్ టాస్క్ ను ఇస్తారు.
ఇక నాన్ వెజ్ ఐటమ్స్ లో మీకు ఇష్టమైన స్పెషల్ ను తయారు చేయమని సంజయ్ (Sanjay) అనగానే.. రామచంద్ర ఒకసారిగా స్టన్ అవుతాడు. ఇక రామచంద్ర (Rama Chandra) నేను మాంసం ముట్టుకోను సార్ దానికి బదులుగా ఏదైనా వంట చేస్తా అని అంటాడు. దానికి అక్కడ జడ్జ్ లు తిరస్కరిస్తారు.