- Home
- Entertainment
- Janaki Kalaganaledu: నీకు చదువు ఇష్టంలేదని రామచంద్రకు చెప్పు.. జానకికి షాకింగ్ కండిషన్ పెట్టిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: నీకు చదువు ఇష్టంలేదని రామచంద్రకు చెప్పు.. జానకికి షాకింగ్ కండిషన్ పెట్టిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతోంది. ఇక ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానాల్లోనే దూసుకెళుతోంది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

జానకి (Janaki) చదువు కోసం రామ చంద్ర తన తల్లి జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు. మొదట రామచంద్ర మాటలు తనకి అర్థం కాక పోవడంతో అసలు విషయం ఏంటి అని జ్ఞానాంబ అడుగుతుంది. ఇక రామచంద్ర (Rama Chandra) జానకి చదువు విషయం గురించి అనేసరికి జ్ఞానంబ షాక్ అవుతుంది.
పక్కనే ఉన్న జానకి (Janaki) తన అత్తయ్య ఏం సమాధానం ఇస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రామచంద్ర (Rama Chandra) ధైర్యం తెచ్చుకొని తన భార్య చదువు కోసం మనసులో మాటలను బయట పెడతాడు. జానకి చదువుకుంటే మంచి గౌరవం ఉంటుందని ఊరిలో మంచి పేరు వస్తుందని అంటాడు.
అంత పెద్ద ఆఫీసర్ లే స్వయంగా మన ఇంటికి వచ్చి జానకి (Janaki) చదువు గురించి అడిగారు అంటే ఎంత విలువ ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మ అని అంటాడు. ఇప్పటివరకు జానకి తన చదువు విషయంలో తన నిర్ణయం తీసుకోలేదని మీ పైనే వదిలేసిందని అంటాడు.
అలా రామచంద్ర (Rama Chandra) మాటలు విన్న జ్ఞానాంబ.. ఈ ఆలోచన నీదా.. జానకిదా అని షాక్ ఇస్తుంది. దాంతో రామచంద్ర ఆ ఆలోచన నాదే అని అంటాడు. కానీ జ్ఞానాంబ మాత్రం తనకు నచ్చినట్లు గానే సమాధానం ఇస్తుంది. పక్కనే ఉన్న గోవిందరాజు కూడా జ్ఞానాంబను (Jnanamba) అడిగే ప్రయత్నం చేయగా ఆయన మాటలను కూడా పట్టించుకోదు.
ఇక జానకి (Janaki) బాధపడుతూ అదే విషయాన్ని ఆలోచిస్తుంది. మరోవైపు జ్ఞానాంబ కూడా జానకి విషయం గురించి ఆలోచిస్తుంది. ఇక జానకిని తన దగ్గరికి పిలిపించుకొని తన నిర్ణయం అడుగుతుంది. దాంతో జానకి మీరు ఏది చెబితే అదే అనడంతో.. జ్ఞానాంబ (Jnanamba) చదువుకోవద్దని..
అంతే కాకుండా నీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలని అంటుంది. ఇక జానకి (Janaki) సరే అని కన్నీరు పెడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా రామచంద్రకు (Rama Chandra) నువ్వే చెప్పాలి అని.. నీకు ఇష్టం లేదు అన్నట్లుగానే చెప్పాలి అని అంటుంది.