MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • భాగ్యశ్రీతో రామ్ పోతినేని డేటింగ్ ? ఆమెని అలా పిలిచి రూమర్స్ మరింత పెంచేశాడుగా..

భాగ్యశ్రీతో రామ్ పోతినేని డేటింగ్ ? ఆమెని అలా పిలిచి రూమర్స్ మరింత పెంచేశాడుగా..

భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి మిస్టర్ బచ్చన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ భాగ్యశ్రీ గ్లామర్ లుక్స్, డ్యాన్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 07 2025, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Pothineni

Ram Pothineni

యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మంగళవారం తన పుట్టిన రోజుని సెలెబ్రేట్ చేసుకుంది. భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి మిస్టర్ బచ్చన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ భాగ్యశ్రీ గ్లామర్ లుక్స్, డ్యాన్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించాయి. దీనితో ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ఆమె నటిస్తున్న తదుపరి చిత్రాల బృందాల నుండి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించినది హీరో రామ్ పోతినేని తెలిపిన శుభాకాంక్షలే.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గత కొన్ని నెలలుగా భాగ్యశ్రీ, రామ్ మధ్య డేటింగ్, లవ్ ఎఫైర్ లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ RAPO 22 సినిమా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై ఇద్దరూ ఎటువంటి క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వలేదు.

 

Related Articles

Related image1
ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు
Related image2
ఆపరేషన్ సిందూర్ పై టాలీవుడ్ రియాక్షన్: మెగాస్టార్ చిరంజీవి, కాజల్, తాప్సీ ఏమన్నారో తెలుసా ?
35

ఈ నేపథ్యంలో రామ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా భాగ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. RAPO 22 సినిమాలో భాగ్యశ్రీ ఫొటోను షేర్ చేస్తూ, "హ్యాపీ బర్త్ డే BB! ఈ ఏడాది నీకు ప్రేమ, విజయాలు, సంతోషం దక్కుతాయని ఆశిస్తున్నా. అందుకు నువ్వు అర్హురాలివి. Love ‘n’ Luck #RAPO" అని రామ్ పోస్ట్ చేశారు .

 

45

ఈ సందేశంలో "BB" అని సంబోధించడం, అలాగే "Love 'n' Luck" అనే మాటలు నెటిజన్లలో కొత్త చర్చకి దారి తీశాయి. కొందరు అభిమానులు ఇది కేవలం సహనటికి ఇచ్చిన శుభాకాంక్ష మాత్రమేనని భావించినా, మరికొందరు వీరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉండవచ్చనిఅంటున్నారు. BB అంటే భాగ్యశ్రీ బోర్సే అని షార్ట్ గా పిలవడమే. కానీ కొంతమంది నెటిజన్లు మరోలా ఊహించుకుంటున్నారు. 

 

55

అయితే ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే—ఇదంతా కేవలం ఊహాగానమే కావచ్చని, రామ్ కేవలం సహనటి పుట్టినరోజు సందర్భంగా మాత్రమే శుభాకాంక్షలు తెలిపి ఉండొచ్చు అని అంటున్నారు. కానీ రామ్ మాత్రం తన పోస్ట్ తో ప్రస్తుతం ఉన్న రూమర్స్ ని మరింతగా పెంచాడు అనే చెప్పాలి. 

ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్నకింగ్ డమ్ , దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కాంత వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.ఒకవైపు తన గ్లామర్ తో , మరోవైపు డేటింగ్ రూమర్స్ తో భాగ్యశ్రీ ఫుల్ పబ్లిసిటీ కొట్టేస్తోంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Related Stories
Recommended image1
ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు
Recommended image2
ఆపరేషన్ సిందూర్ పై టాలీవుడ్ రియాక్షన్: మెగాస్టార్ చిరంజీవి, కాజల్, తాప్సీ ఏమన్నారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved