MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు

ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు

తెలుగు సినిమా స్థాయిని పెంచేలా అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు వస్తుంటాయి. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటారు. ప్రేక్షకులను, చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో చిత్రాలు రూపొందించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2025, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nagarjuna, Chiranjeevi, Sr NTR

Nagarjuna, Chiranjeevi, Sr NTR

తెలుగు సినిమా స్థాయిని పెంచేలా అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు వస్తుంటాయి. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటారు. ప్రేక్షకులను, చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో చిత్రాలు రూపొందించారు. అయితే తన కెరీర్ లో వచ్చిన కొన్ని అద్భుతమైన చిత్రాలని ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరని రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్రరావు రూపొందించిన అంతటి అద్భుతమైన చిత్రాలు ఏంటి? వాటి గురించి ఆయన ఏం చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
raghavendra rao

raghavendra rao

రాఘవేంద్రరావు మాట్లాడుతూ ముందుగా ఎన్టీఆర్ తో రూపొందించిన అడవి రాముడు చిత్రం గురించి ప్రస్తావించారు. నా కెరీర్ ని పూర్తిగా మార్చేసిన చిత్రం అది. థియేటర్లో ఒక సినిమా చూస్తూ ప్రేక్షకులు డబ్బులు విసిరేయడం అనేది అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. అది నా కెరీర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమా సాధించిన రెవెన్యూ కూడా ఒక సంచలనం.
 

35
అడవి రాముడు

అడవి రాముడు

లెజెండ్రీ నటుడు రాజ్ కపూర్ కూడా అడవి రాముడు మూవీ చూసి ఆశ్చర్యపోయారు అని రాఘవేంద్రరావు అన్నారు. అడవి రాముడు చిత్రంలో సాంగ్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ మూవీ 200 రోజులు ఫంక్షన్ కి ఆయన హాజరయ్యారు అని రాఘవేంద్రరావు అన్నారు. రాఘవేంద్రరావు ప్రస్తావించిన మరో చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన దృశ్య కావ్యం అది.

45

ఆ సినిమా రిలీజ్ టైం లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన తుఫాను ఉంది. థియేటర్లో కూడా వరద నీరు చేరాయి. అయినా కూడా ప్రేక్షకులు ఆ మూవీ చూస్తూ థియేటర్ నుంచి బయటికి వెళ్లలేదు. దీంతో ఫైర్ ఇంజన్ తీసుకువచ్చి వర్షపు నీటిని తొలగించాల్సి వచ్చింది అని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.
 

55

ఇక తనకి ఎంతో ఇష్టమైన చిత్రం అన్నమయ్య. అప్పటివరకు నేను కమర్షియల్ చిత్రాలు తీశాను. కానీ అన్నమయ్య నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ మూడు చిత్రాలను నేను కూడా తిరిగి అంత గొప్పగా తీయలేను. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి చిత్రాలు ఇక రావు అని రాఘవేంద్రరావు అన్నారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
ఏకంగా 10 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య.. నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకోబోతున్నారో తెలుసా ?
Recommended image2
ఎన్టీఆర్ సినిమా కోసం తీవ్రంగా పోటీ పడుతున్న దిల్ రాజు, నాగవంశీ.. రికార్డు ధర ఖాయం ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved