- Home
- Entertainment
- సుడిగాలి సుధీర్ గురించి ఆటో రామ్ ప్రసాద్ చెప్పిన సంచలన నిజాలు.. సుధీర్ జబర్థస్త్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే ?
సుడిగాలి సుధీర్ గురించి ఆటో రామ్ ప్రసాద్ చెప్పిన సంచలన నిజాలు.. సుధీర్ జబర్థస్త్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే ?
సుడిగాలి సుధీర్ గురించి సంచలన నిజాలు బయటపెట్టారు ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఆటో రామ్ ప్రసాద్. అసలు సుధీర్ ఎందుకు జబర్ధస్త్ నువీడాల్సి వచ్చిందో వివరించాడు. హైపర్ ఆదితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రామ్ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

దాదాపు పదేళ్లుగా బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తున్న జబర్థస్త్ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. అందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్ , హైపర్ ఆది, అధిరే అభిలాంటివారు వీడిచి వెళ్ళిపోతున్నారు. ఈ విషయంపై స్పందిచారు ఆటో రామ్ ప్రసాద్.
జబర్థస్త్ అంటే గుర్తుకు వచ్చే కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ టీమ్ కు స్పెషల్ ప్లేస్ ఉంది. సుధీర్ కు బుల్లితెరపై ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అటువంటి సుధీర్ జబర్థస్త్ ను వదిలి పెట్టి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆటో రాం ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
జబర్థస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇటీవల సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. వీటన్నిటికీ స్పందిస్తూ హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సుధీర్ ప్రోగ్రాం విడిచి వెళ్లి పోవడానికి గల కారణాన్ని రామ్ ప్రసాద్ చెప్పారు.
రాంప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ, సుధీర్ 2 సంవత్సరాల క్రితమే జబర్దస్త్ వదిలి వెళ్లాల్సింది అని, కానీ వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా వదిలిపెట్టి వెళ్లలేకపోయారన్నారు. అందరం కలిసి జబర్థస్త్ చేద్దాం అని అనుకున్నారట. అందుకే ఆఫర్లు వచ్చినా.. తమ ఫ్రెండ్షిప్ కోసం వాటిని వదులుకున్నట్టు తెలిపారు.
అంతే కాదు సుధీర్ జబర్దస్త్ విడిచి వెళ్లడానికి ఎంటువంటి వివాదాస్పద కారణాలు లేవు.. సుధీర్ సినిమాలు చేయడం, మంచి అవకాశాలు రావడంతో సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల జబర్థస్త్ ను వదలాల్సి వచ్చిందన్నారు. దానితో పాటు అగ్రిమెంట్ కూడా అయిపోవడంతో.. కూల్ గా సుధీర్ వెళ్ళిపోయాడన్నారు రామ్ ప్రసాద్.
అలాగే సుధీర్ కి ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోవాలి అని ఉంది దాంతో మంచి ఆఫర్ రావడంతో వెళ్ళారు అని అన్నారు రామ్ ప్రసాద్. అయినా కూడా సుధీర్ ఇప్పటికీ మల్లెమాలని గౌరవిస్తారు అని రామ్ ప్రసాద్ ఇంటర్వ్యూలో వివరించాడు.