Devatha: దేవి ఆదిత్య కన్నకూతురని సత్య తెలుసుకుంటుందా? మాధవ్ కొత్త ప్లాన్ ఏంటి?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. నువ్వు ఆదిత్యను కలవడం చూసేవాళ్ళకి అంతబాగుండదు కాదమ్మా.. రేపు నిన్ను నలుగురు తప్పుగా అంటుంటే నేను వినలేను అమ్మ.. నిన్ను అంటే నన్ను నా కుటుంబాన్ని అన్నట్టే కాదమ్మా అని రాంమూర్తి రాధతో అంటాడు.. నీకోసం చెబుతున్న అమ్మ నువ్వు అర్ధం చేసుకుంటున్నావ్ అని చెప్పి వెళ్లిపోతుంటే జరా ఆగండి.. అని రాధ రామూర్తికి నిజం చెప్పాలి అని అంటుంది.
ఏంటి అని అడిగితే నేను ఆఫీసర్ సార్ తో మాట్లాడితే తప్పు కాదు ఎందుకంటే నేను మాట్లాడుతుంది నా పెనిమిటితో అని రాధ అంటుంది. ఆ మాటలు విన్న రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆదిత్య నీ పెనిమిటినా అని షాక్ అవుతాడు. అతను నీ పెనిమిటి ఏంటి అమ్మ అని అంటే అవును అతను నా పెనిమిటి నా మేడలో తాళి కట్టిన పెనిమిటి దేవమ్మ నాయన అని రాధ చెప్తుంది.
అప్పుడు రామ్మూర్తి నువ్వు చెప్పేది నిజామా అని అంటే చిన్మయి వచ్చి నిజం అని చెప్తుంది. వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు నాయనమ్మకు అలా జరిగిందని చెప్తుంది. ఇది కల కాదు కదా రాధ అని అంటే కల కాదు నా పేరు రాధ కాదు రుక్మిణి అని చెప్పి షాకిస్తుంది. జానకమ్మకి ఆరోగ్యం బాగవుతే నేను పోత అని అంటుంది. ఆ మాటలు విన్న రామ్మూర్తి రాధను నువ్వు దేవత అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకొని దండం పెట్టి వెళ్ళిపోతాడు.
ఇక మరోవైపు దేవి దువుడమ్మ ఇంట్లో రాధ ఫోటో చూసి మా అమ్మను ఇంకా మర్చిపోలేదు.. మా అమ్మను ఇక్కడకు తీసుకురావాలి అని అనుకుంటుంది. అప్పుడే దేవుడమ్మతో దేవి ఆప్యాయంగా మాట్లాడుతుంటే అది చూసి సత్య బాధగా ముఖం పెడుతుంది. నువ్వు కాకుండా మా దేవుడమ్మను అనేవారు లేరు అంటే నేను కాకుండా ఇంకెవరైనా మా అవ్వని అంటే బొక్కలు ఇరగ్గొడుత అని అంటుంది.
ఆతర్వాత దేవుడమ్మతో భోజనం తినిపించుకుంటుంది. అప్పుడే మాధవ్ మీ నాన్న కాదు అన్నావ్.. మరీ మీ నాన్న ఎవరో చెప్పలేదు అని దేవుడమ్మ అడుగుతుంది. అప్పుడు దేవి అది తెలీదు అందుకే కదా నేను ఊరంతా వెతుకుతున్న అని అంటుంది. అప్పుడు దేవుడమ్మ మాధవ్ ఎందుకు మీ నాన్నను వెతకలేదు అని అంటే అప్పుడు చెప్పి మంచి పని చేశాడు. అందుకే కదా మా నాన్న ఎంత మంచివాడో నాకు తెలిసింది అని దేవి అంటుంది.
అప్పుడు దేవితో దేవుడమ్మ నువ్వు మీ నాన్న కోసం వెతుకుతున్నావ్.. నేను నా కోడలు కోసం వెతుకుతున్న అని దేవుడమ్మ అంటుంది. అప్పుడు దేవి మీ కోడలు అంటే మీకు అంత ఇష్టమా అని అడిగితే ఇంట్లో వారందరు రుక్మిణిని పొగుడుతారు. ఆ మాటలు విని దేవి ఆనందపడుతుంది. వీళ్లంతా ఇంత ఆనందపడుతుంటే అమ్మ ఎందుకు ఇక్కడకు రావడం లేదని బాధ పడి దేవి రుక్మిణి ఫోటో తీసుకురమ్మని అడుగుతుంది. అలా అడగగానే సత్య, ఆదిత్య ఇద్దరు ఒక్కసారిగా టెన్షన్ పడుతారు.
అప్పుడు దేవుడమ్మ ఇంతమంది వెతికాం మాకు కనిపించలేదు నీకు కనిపిస్తుందా? అని అంటే ఏమో ఎవరికీ తెలుసు కనిపిస్తుంది ఏమో అని అంటుంది. సరే తిన్న తర్వాత చుపిస్తాలే అంటే ఇప్పుడు ఫోటో చూస్తే రుక్మిణిని డైరెక్ట్ గా నిలదీస్తుంది ఏమో అని భయపడుతాడు. ఆతర్వాత దేవి దేవుడమ్మతో కలిసి వెళ్ళాలి అంటే ఆదిత్య వద్దు అని అంటాడు. అయినా తను వెళ్తుంది. ఆతర్వాత దేవి చెప్పిన మాటల గురించి సత్య ఆలోచిస్తూ దేవి మాధవ్ బిడ్డ కదా మరి ఎవరి బిడ్డ అని మాధవ్ కు ఫోన్ చేస్తుంది.. అంతే అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.