- Home
- Entertainment
- శ్రీదేవి కోసం చంపుతా అంటూ రాఘవేంద్ర రావుకి ఆర్జీవీ వార్నింగ్.. ఆ యాక్సిడెంట్ చూసి వర్మ హార్ట్ స్కిప్
శ్రీదేవి కోసం చంపుతా అంటూ రాఘవేంద్ర రావుకి ఆర్జీవీ వార్నింగ్.. ఆ యాక్సిడెంట్ చూసి వర్మ హార్ట్ స్కిప్
వర్మకి అతిలోక సుందరి శ్రీదేవి అంటే అమితమైన ఇష్టం. వర్మ పలు సందర్భాల్లో శ్రీదేవిపై ప్రేమని బహిరంగంగానే చెప్పారు. శ్రీదేవి కోసం వర్మ ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని చంపుతా అంటూ బెదిరించారు.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మకి ఏ విషయంలోనూ ఎమోషన్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వర్మ లైట్ తీసుకుంటూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో వర్మ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటిని సమర్థించుకునే నైపుణ్యం కూడా వర్మ దగ్గర ఉంది.
అలాంటి వర్మకి అతిలోక సుందరి శ్రీదేవి అంటే అమితమైన ఇష్టం. వర్మ పలు సందర్భాల్లో శ్రీదేవిపై ప్రేమని బహిరంగంగానే చెప్పారు. శ్రీదేవి కోసం వర్మ ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని చంపుతా అంటూ బెదిరించారు కూడా. శ్రీదేవి ఉన్నప్పుడు రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ ఆమెతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో శ్రీదేవి రాఘవేంద్ర రావు తండ్రి సూర్య ప్రకాష్ రావు దర్శకత్వంలో కూడా నటించింది. ఆ సమయంలో రాఘవేంద్ర రావు కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించేవారట. తన తండ్రి లేని సమయంలో శ్రీదేవిపై రన్నింగ్ షాట్ చిత్రీకరించి మెప్పు పొందాలనుకున్నారట రాఘవేంద్ర రావు.
మద్రాసులోని మౌంట్ రోడ్డులో శ్రీదేవి రోడ్డు దాటుతూ పరిగెత్తాలి. శ్రీదేవి చిన్న పిల్ల కాబట్టి ఏం చెప్పినా తిరిగి అడగకుండా చేసేది. రోడ్డులో వేగంగా పరిగెత్తింది. రోడ్డు దాటే క్రమంలో ఒక కారు వేగంగా రావడం శ్రీదేవి కాలి మడమకు తగలడంతో ఆమె అక్కడే పడిపోయింది. అప్పటికే శ్రీదేవి ముందుకు వచ్చేయడంతో వెంట్రుక వాసిలో పెద్ద ప్రమాదం తప్పింది అని రాఘవేంద్ర రావు గుర్తు చేసుకున్నారు. క్షణంలో మిస్ అయింది అని శ్రీదేవి కూడా తెలిపింది.
ఆ క్లిప్పింగ్ ని కూడా చూపించారు. ఆ వీడియో చూడగానే వర్మ హార్ట్ స్కిప్ అయింది. ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అని రాఘవేంద్ర రావు అంటుంటే.. అప్పుడు నేను మిమ్మల్ని చంపేసే వాడిని అంటూ వర్మ కామెంట్స్ చేయడం నవ్వులు పూయించింది. వర్మ దర్శకత్వంలో శ్రీదేవి క్షణక్షణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
శ్రీదేవిని పెళ్లి చేసుకున్న బోనీ కపూర్ తనకు పెద్ద శత్రువు అంటూ ఎన్నోసార్లు వర్మ సరదాగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవి అందానికి తాను భక్తుడిని అని వర్మ ప్రకటించుకున్నారు కూడా.