షాకింగ్ : రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఒక్కొక్క వ్యూకి రూ.11 వేలు
వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన 'వ్యూహం' సినిమా ఆర్థిక అవకతవకలకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా సినిమా ప్రదర్శనకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎలక్షన్ సమయంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ.
రిలీజ్ కు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కానీ సినిమా వర్కవుట్ కాలేదు. అందుకు రకరకాల కారణాలు ఉన్నా,సినిమా బాగోలేదనేది నిజం. అది ప్రక్కన పెడితే ఇప్పుడు వ్యూహం చిత్రం మరోసారి వార్తలకు ఎక్కింది. ఈ సినిమా విషయంలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు.
వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? వంటివి ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో చూపించారు.
‘వ్యూహం సినిమా ఒక్కరు ఒక్కసారి చూసినందుకు ఆర్జీవీ ఆర్వీ అనే సంస్థకు ఏపీ ఫైబర్‌నెట్ రూ.11 వేలు చెల్లించింది. ఇలా మొత్తం రూ.2.10 కోట్లు ఫైబర్‌నెట్ బ్యాంకు ఖాతా నుంచి డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ ఆర్వీ) సంస్థ బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయి’ అని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఫైబర్‌నెట్ ఛానల్‌లో ‘వ్యూహం’ సినిమా విడుదల చేస్తే.. అప్పట్లో 1,863 మంది మాత్రమే చూసారన్నారు. ఒప్పందం ప్రకారం ఒకసారి చూసినందుకు రూ.100 చెల్లించాలని, ఈ లెక్కన ఆర్జీవీ సంస్థకు రూ.2 లక్షలకు మించి చెల్లించకూడదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సంస్థలో ఇలా ఎన్నో అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.
సంస్థ కార్యాలయంలో జీవీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... ‘గత ఐదేళ్లలో ఫైబర్‌నెట్‌లో ఏకంగా రూ.6,869 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. వ్యాపార సామర్థ్యాన్ని పెంచారా అంటే అదీ లేదు. తెదేపా హయాంలో 10 లక్షలున్న కనెక్షన్ల సంఖ్య గత ఐదేళ్లలో 5 లక్షలకు పడిపోయింది. ఇతర పథకాల కింద వేసిన లైన్లనే మళ్లీ లెక్కల్లో చూపి, అక్రమంగా బిల్లులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
2019లో తెదేపా ప్రభుత్వం ఉండగా ఫైబర్‌నెట్‌లో 108 మంది సిబ్బందికి జీతాల కింద నెలకు రూ.40 లక్షలు చెల్లించాం. వైకాపా హయాంలో ఎంపీ, ఎమ్మెల్యే వాట్సప్ మెసేజ్ చేస్తే చాలు.. నియామక ఉత్తర్వులు ఇచ్చేయడంతో ఉద్యోగుల సంఖ్య 1,363కు పెరిగింది. వారి జీతాలకే ప్రతి నెలా రూ.4 కోట్లు ఖర్చవుతోంది. వారంతా ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియదు. గత ప్రభుత్వ తీరుతో సంస్థ రూ.1,262 కోట్ల అప్పుల్లోకి వెళ్లింది. వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది’ అని వివరించారు.
చిత్రం కథ విషయంకు వస్తే.. కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించే ప్రయత్నం చేసారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూసారని తెలుస్తోంది..