- Home
- Entertainment
- ఆ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ని అడిగా, చేయనున్నాడు..ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్, పాతికేళ్ల క్రితమే
ఆ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ని అడిగా, చేయనున్నాడు..ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్, పాతికేళ్ల క్రితమే
ఇటీవల ఎక్కువగా వర్మ పొలిటికల్ హీట్ పెంచే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వర్మ పవన్ తో ఓ చిత్రం నిర్మించాలనుకున్నాడట.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మకి ఏ విషయంలోనూ ఎమోషన్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వర్మ లైట్ తీసుకుంటూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో వర్మ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటిని సమర్థించుకునే నైపుణ్యం కూడా వర్మ దగ్గర ఉంది.
రాంగోపాల్ వర్మ ఎక్కువగా శృంగారం, రాజకీయం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కామెంట్స్ చేయడం చూస్తున్నాం. ఇటీవల ఎక్కువగా వర్మ పొలిటికల్ హీట్ పెంచే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ తిరిగి వర్మని ట్రోల్ చేయడం కూడా చూస్తున్నాం.
ఇటీవల ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ తనకి పవన్ ఫ్యాన్స్ ని గిల్లడం అంటే ఇష్టం అని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కి, వర్మకి ఎలాంటి సంబంధం లేదు. కానీ గతంలో వర్మ పవన్ తో ఓ చిత్రం నిర్మించాలనుకున్నాడట. గతంలో వర్మ వినీత్, జెడి చక్రవర్తి హీరోలుగా వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనే చిత్రాన్ని నిర్మించారు. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఆ చిత్రం కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ని అడిగామని వర్మ తెలిపారు. కానీ పవన్ అలాంటి చిత్రాలు చేయనని అన్నాడు. 2019 ఎన్నికలకు ముందు కూడా వర్మ పవన్ ని టార్గెట్ చేస్తూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మీడియా ప్రతినిధులు పవన్ ని అడగగా.. వర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. ఒక చిత్రం విషయంలో వర్మ తన వద్దకు వస్తే కథని కాస్త మార్చమని మాత్రమే చెప్పినట్లు పవన్ అప్పట్లో కామెంట్స్ చేశాడు.
అంటే వర్మ చెప్పిన చిత్రమేనా అది లేక మరో కథతో వర్మ పవన్ అని సంప్రదించారా అనేది క్లారిటీ లేదు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఈసారి తన పార్టీ అభ్యర్ధులని గెలిపించాలని ప్రజలని కోరుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా వర్మ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ అలా ప్రజలని అడుక్కోవడం తనకి ఇష్టం లేదని అన్నాడు. పవన్ ఎప్పుడూ హీరోలాగే ఉండాలని, జీరో కాకూడదని అన్నారు. ప్రస్తుతం వర్మ ఏపీ రాజకీయాలపై వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.