- Home
- Entertainment
- పొలిటికల్ గా టార్గెట్ అయిన చిరంజీవి మూవీ, వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు.. నిర్మాత సంచలనం, అసలేం జరిగింది ?
పొలిటికల్ గా టార్గెట్ అయిన చిరంజీవి మూవీ, వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు.. నిర్మాత సంచలనం, అసలేం జరిగింది ?
నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు చేశారు. భోళా శంకర్ చిత్రాన్ని కొందరు పొలిటికల్ గా టార్గెట్ చేశారు అని అన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం.

నిర్మాత అనిల్ సుంకర చిత్రాలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్స్ పై అనేక చిత్రాలు నిర్మించారు. దూకుడు, లెజెండ్, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయవంతమైన చిత్రాలని ఆయన నిర్మించారు. కానీ హిట్స్ కంటే అనిల్ సుంకర కెరీర్ లో ఫ్లాప్ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో వ్యాపారాల్లో రాణిస్తున్న అనిల్ సుంకర సినిమాపై మక్కువతో నిర్మాతగా మారారు.
ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలతో ఎదురుదెబ్బ
ఆయన సినిమాల్లో చాలా డబ్బు నష్టపోయారు అనే ప్రచారం ఉంది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన చివరగా నిర్మించిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాల పరాజయం గురించి వివరించారు. నేను నిర్మించిన చిత్రాలు హిట్ అండ్ ఫ్లాప్ తో లాభ నష్టాలు బ్యాలెన్స్ అవుతూ వచ్చాయి. కానీ ఏజెంట్, భోళా శంకర్ రెండు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వల్ల పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
అది అవాస్తవం
దీనిని బేస్ చేసుకుని కొందరు పూర్తిగా అవాస్తవమైన రూమర్స్ క్రియేట్ చేశారు. భోళాశంకర్ ఫ్లాప్ తర్వాత తాను ఇల్లు అమ్ముకున్నానని, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లానని ప్రచారం చేశారు. కానీ ఆ రూమర్స్ పూర్తిగా అవాస్తవం. భోళాశంకర్ తర్వాత నష్టాలు వచ్చిన మాట వాస్తవమే కానీ ఇల్లు అమ్ముకునే స్థితికి దిగజారలేదు. మూడు రోజులు ఫోన్ పక్కన పెట్టేశాను. రిలాక్స్ అవ్వడం కోసమే అలా చేశా. ఈ లోపు నా గురించి ఏవేవో రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి.
పొలిటికల్ గా టార్గెట్ చేశారు
భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి చాలా హెల్ప్ చేశారు. వాస్తవానికి భోళా శంకర్ చిత్రానికి అంత నెగిటివిటీ రావడం వెనుక రాజకీయాలు కూడా ఉన్నాయి. కొన్ని పొలిటికల్ వర్గాలు చిరంజీవి గారిని టార్గెట్ చేసే క్రమంలో భోళా శంకర్ చిత్రంపై పూర్తి నెగిటివిటీ క్రియేట్ చేశారు. వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు అంటూ అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు చేశారు.
అఖిల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు
ఇక ఏజెంట్ మూవీ విషయానికి వస్తే ఆ సినిమా రిజల్ట్ నేను ముందుగా ఊహించిందే. ఈ మూవీలో ఏదో తేడా జరుగుతోంది అనిపించింది. మంచి కంటెంట్ లేనప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నా అద్భుతాలు జరగవు అని అనిల్ సుంకర అన్నారు. ఆ చిత్రానికి కూడా బాగా నష్టపోయాను. కానీ అఖిల్ ఆ మూవీకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని అనిల్ సుంకర అన్నారు.