- Home
- Entertainment
- ఆయన వల్లే చిరంజీవి 'బిగ్గర్ దేన్ బచ్చన్', రజనీ సూపర్ స్టార్ అయ్యారు.. దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
ఆయన వల్లే చిరంజీవి 'బిగ్గర్ దేన్ బచ్చన్', రజనీ సూపర్ స్టార్ అయ్యారు.. దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి, రజనీకాంత్ లాంటి హీరోలు స్టార్లుగా ఎదిగింది అమితాబ్ బచ్చన్ వల్లే అంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. దానికి గల కారణాలు ఈ విధంగా వివరించారు.

బాలీవుడ్ కి పోటీగా సౌత్ చిత్రాలు
ఇటీవల కాలంలో బాలీవుడ్ ని మించేలా దక్షిణాది చిత్ర పరిశ్రమలో సినిమాలు నిర్మిస్తున్నాయి. సౌత్ చిత్రాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ కంటే దక్షణాది చిత్ర పరిశ్రమ బాగా వెనుకబడి ఉండేది. కానీ 70, 80 దశకం నుంచి సౌత్ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ కి పోటీ ఇవ్వడం ప్రారంభించింది అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు.
అమితాబ్ రీమేక్ చిత్రాల ప్రభావం
సౌత్ సినిమా ఎదగడం వెనుక బాలీవుడ్ చిత్రాల ప్రభావమే కారణం అని, ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ చిత్రాలు కారణం అని వర్మ అన్నారు. సౌత్ సినిమా ఎదుగుదలలో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రాల రీమేక్‌లు కీలక పాత్ర పోషించాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
వాళ్లంతా స్టార్లు అయింది అమితాబ్ వల్లే..
ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ, 1970, 1980లలో దక్షిణాదికి చెందిన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం నాలుగు ప్రధాన చిత్ర పరిశ్రమలు అమితాబ్ బచ్చన్ హిట్ సినిమాలను వరుసగా రీమేక్ చేసేవని తెలిపారు. ఈ తరుణంలో రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీఆర్, రాజ్‌కుమార్ లాంటి తారలు తమ కెరీర్‌ను నిర్మించుకున్నారని చెప్పారు.
అమితాబ్ తీసుకున్న విరామం చిరంజీవి, రజనీకి కలసి వచ్చిందా ?
1990లలో అమితాబ్ ఐదు సంవత్సరాల విరామంలో ఉన్నప్పుడు దక్షిణాదిలో బచ్చన్ చిత్రాల మాదిరిగా మసాలా సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఆ సమయంలో చిరంజీవి, రజనీకాంత్ లాంటి హీరోలు అభిమానులకు డెమి గాడ్స్ గా మారిపోయారు. చిరంజీవి బిగ్గర్ దేన్ బచ్చన్ అంటూ ప్రశంసలు దక్కాయి. రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు అని వర్మ అన్నారు. ఇదంతా వారు అమితాబ్ బచ్చన్ బాడీ లాంగ్వేజ్ ని, ఆయన పాత్రలని ఆదర్శంగా తీసుకోవడం వల్లే జరిగింది అన్నట్లుగా వర్మ కామెంట్స్ చేశారు.
నెటిజన్ల విమర్శలు
అమితాబ్ బచ్చన్ వల్లే సౌత్ చిత్రాలకు మసాలా సినిమాల బ్రాండ్ ఏర్పడింది అని వర్మ తెలిపారు. సౌత్ లో ఇప్పటికీ మసాలా చిత్రాల ట్రెండ్ ఉందంటే అందుకు కారణం అప్పట్లో అమితాబ్ చిత్రాల ప్రభావమే అని వర్మ తెలిపారు. అయితే వర్మ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి తన కెరీర్ లో ఒకటి రెండు చిత్రాలని మాత్రమే అమితాబ్ బచ్చన్ మూవీస్ నుంచి రీమేక్ చేశారని నెటిజన్లు అంటున్నారు. చిరంజీవి, రజనీ లకు సొంత స్టైల్ ఉందని.. ఎప్పుడూ అమితాబ్ ని వారు అనుకరించలేదు అని అంటున్నారు.