- Home
- Entertainment
- NTR మార్ఫింగ్ వీడియో వివాదం.. సెలబ్రిటీలదే తప్పు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
NTR మార్ఫింగ్ వీడియో వివాదం.. సెలబ్రిటీలదే తప్పు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
RGV On NTR Devara Deepfake Video: ఎన్టీఆర్ దేవర 'చుట్టమల్లే' ఏఐ మార్ఫింగ్ వీడియోపై సెలబ్రిటీల స్పందనను రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తప్పుబట్టారు. ట్వీట్లతో ఆ లింక్‌కే ఉచిత పబ్లిసిటీ ఇచ్చారని సంచలన కామెంట్స్ చేశారు.

డీప్‌ఫేక్ డార్క్‌సైడ్: దేవర పాటపై మొదలైన ఏఐ రచ్చ
టాలీవుడ్‌లో ఏఐ డీప్‌ఫేక్ రచ్చ లేపుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర కాలుస వర్షం కురిపించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘చుట్టమల్లే’ పాట ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో పెద్ద వివాదానికి దారితీసింది. కొందరు ఆకతాయిలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వాడుకుని, ఈ పాటలోని జాన్వీ కపూర్ విజువల్స్‌ను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఏఐ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం, టాలీవుడ్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తారక్ మాస్ వార్నింగ్
ఈ నీచమైన పనిపై ఎన్టీఆర్ సోషల్ మీడియాలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. "మహిళలను దేవతలుగా, తల్లులుగా పూజించే పవిత్రమైన గడ్డ మనది. 'మాతృదేవోభవ' అనే సంస్కృతి ఉన్న చోట, ఏఐ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని మహిళల గౌరవాన్ని బజారున పడేయడం సిగ్గుచేటు" అంటూ మండిపడ్డారు. ఈ అసభ్యకర కంటెంట్‌ను క్రియేట్ చేసిన వారిని, వైరల్ చేస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, ఈ రోజు వేరొకరు బాధితులు కావచ్చు, రేపు మీ ఇంట్లోని వాళ్లే బాధితులు అయ్యే ప్రమాదం ఉందంటూ నెటిజన్లకు కంటిన్యూగా ఆలోచింపజేసే మెసేజ్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏఐ డిజిటల్ నేరాలను అరికట్టేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు సపోర్టుగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని వంటి టాప్ స్టార్లు రంగంలోకి దిగారు.
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
— Jr NTR (@tarak9999) October 3, 2026
వర్మ ఎంట్రీ: సెలబ్రిటీల తీరుపై ఆర్జీవీ సంచలన ట్వీట్
ఇదిలా ఉంటే, ఈ వివాదంపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సరికొత్త దుమారాన్ని రేపుతున్నాయి. స్టార్లందరూ బాధితురాలికి అండగా నిలబడటాన్ని ఆర్జీవీ వేరే కోణంలో విశ్లేషించారు. సెలబ్రిటీలు చేసిన ట్వీట్ల వల్లే ఆ నీచమైన వీడియోకి కోట్లాది రూపాయల ఉచిత ప్రచారం లభించిందని వర్మ విమర్శించారు. నేరం చేసిన వ్యక్తిని పట్టుకోవడంలో శ్రద్ధ చూపకుండా, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఆ అభ్యంతరకరమైన లింక్ వైపు కోట్ల మంది దృష్టి పడేలా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉచిత ప్రచారమా? బాధితురాలికి న్యాయమా?
ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. "సెలబ్రిటీలందరూ కలిసి సాధించిన ఒకే ఒక్క విజయం ఏంటంటే, ఆ అభ్యంతరకరమైన లింక్‌ను బాగా ప్రచారం చేసి, కోట్లాది మంది ప్రజలు దాన్ని చూసేలా చేయడమే. నిందితుడిని పట్టుకోవడంపై దృష్టి పెట్టి, ఆ విషయాన్ని ప్రచారం చేసి ఉంటే నిజమైన తెలివైన పని అయ్యేది. కానీ దానికి భిన్నంగా ట్వీట్లు చేసి బాధితురాలి గుర్తింపును, ఆ అసభ్యకర కంటెంట్‌ను అందరికీ తెలిసేలా చేశారు. ఇది కూడా ఒక రకంగా నేరమే అవుతుంది" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి పేరు బయటకు రావడానికి, సమస్య మరింత వైరల్ కావడానికి సెలబ్రిటీల హడావుడే కారణమని వర్మ కుండబద్దలు కొట్టారు.
The only thing all the celebrities succeeded in , is to publicise and thereby make crores and crores of people see the objectionable link ..The smart thing would have been to concentrate on catching the perpetrator and publicise that ..Instead what they did is to tweet and bring enormous attention to the victim’s identity and the offensive content which is also a crime
— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2026
నెట్టింట మొదలైన నయా డిబేట్
ప్రస్తుతం వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ బహిరంగంగా స్పందించి వార్నింగ్ ఇవ్వడం వల్ల నేరస్థుల్లో భయం పుడుతుందని కొందరు సమర్థిస్తుంటే.. ఆర్జీవీ చెప్పిన లాజిక్ కూడా ఆలోచించదగ్గదే అని మరికొందరు అంటున్నారు.
హెచ్చరికల పేరుతో వైరల్ చేయకూడని కంటెంట్‌ను ఎక్కువ మంది సెర్చ్ చేసేలా చేస్తున్నారన్నది వర్మ వాదన. ఏదేమైనా, టెక్నాలజీ వేగంగా ఎదుగుతున్న ఈ రోజుల్లో ఏఐ మార్ఫింగ్, డీప్‌ఫేక్ వీడియోల రూపంలో ఎదురవుతున్న ఈ ముప్పు టాలీవుడ్‌ను మాత్రమే కాక సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.

