MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Ram Charan: రెండేళ్ల కూతురు క్లీంకారాను చుట్టుముట్టిన అభిమానులు, రామ్ చరణ్ కోపం

Ram Charan: రెండేళ్ల కూతురు క్లీంకారాను చుట్టుముట్టిన అభిమానులు, రామ్ చరణ్ కోపం

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కు అభిమానులు ఎక్కువ. ఆ ఉత్సాహం ఒక్కోసారి హద్దులు దాటుతుంది. అపోలో ఆసుపత్రికి క్లీన్ కారాతో వచ్చిన రామ్ చరణ్‌ను అభిమానులు అతిగా ప్రవర్తించారు. దీనివల్ల రామ్ చరణ్‌తో పాటూ క్లీన్ కారా కూడా ఎంతో ఇబ్బంది పడింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 02 2026, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెల్ఫీల కోసం మీదపడి
Image Credit : X

సెల్ఫీల కోసం మీదపడి

రామ్ చరణ్ మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందారు. అపోలో ఆసుపత్రిలో ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అపోలో ఆసుపత్రి చుట్టూ విపరీతంగా చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు గుమిగూడారు. రామ్ చరణ్ పేరు వింటేనే అభిమానుల్లో ఉత్సాహం పొంగిపోతుంది. ఒక్కొక్కసారి ఆ ఉత్సాహం హద్దులు దాటితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అపోలో ఆసుపత్రి దగ్గర పరిస్థితులే సాక్ష్యం. రామ్ చరణ్, ఉపాసన డెలివరీ తర్వాత తన కూతురు క్లీన్ కారాను తీసుకొని ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే విషయం తెలిసిన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా గుమిగూడిన అభిమానులతోఆసుపత్రి పరిసరాలు గందరగోళంగా మారిపోయాయి.ఈ ఘటనకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రామ్ చరణ్‌కు కోపం వచ్చింది
Image Credit : X

రామ్ చరణ్‌కు కోపం వచ్చింది

ఆ వీడియోలను బట్టి రామ్ చరణ్ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నప్పుడు అభిమానులు సెల్ఫీలు,వీడియోలు తీసేందుకు చుట్టుముట్టారు. కొందరైతే అతను దగ్గరకు వెళ్లి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే భద్రత సిబ్బందికి పరిస్థితి నియంత్రించడం కూడా కష్టంగా మారిపోయింది. మరోవైపు క్లీన్ కారాను ఎత్తుకొని వచ్చిన రామ్ చరణ్ కూతురు కనిపించకుండా వస్త్రాన్ని కప్పి మరీ తీసుకెళ్లారు. ఆమె ఫోటోలను తీసేందుకు కూడా అభిమానులు అతిగా ప్రవర్తించారు. అపోలో ఆసుపత్రిలో అనేక మంది రోగులు చికిత్స కోసం వస్తూ ఉంటారు. అలాంటి చోట్ల ఇలా ప్రవర్తించడం రాంచరణ్ కి కూడా కోపం తెప్పించింది. అందుకే కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. త్వరగా అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు.

Related Articles

Related image1
Idli Batter: మల్లెపువ్వులాంటి మెత్తటి ఇడ్లీ కోసం పిండి ఇలా కలపండి
Related image2
Cigarette Price Hike: ఒక్కో సిగరెట్‌పై ఎంత పెరిగిందో తెలుసా? జేబుకు చిల్లు పడిపోద్ది
34
నటులకు ప్రైవసీ ఉండాలి
Image Credit : Ram charan Konidela/Instagram

నటులకు ప్రైవసీ ఉండాలి

ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఎంతోమంది స్పందించారు. కొందరు అభిమానులు చరణ్ పై ప్రేమ వల్ల ఇలా జరిగిందని సమర్థిస్తూ కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం అభిమానం ఉన్మాదంగా మారిందని విమర్శించారు. ఆస్పత్రి వంటి ప్రదేశాల్లో సెలబ్రిటీలకు వ్యక్తిగత ప్రైవసీ ఉండాలని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. ఎంత నటుడైన కూడా అతనికి కూడా ఒక కుటుంబం ఉంటుంది.. అతడు కూడా సాధారణ వ్యక్తి అనే అభిప్రాయాన్ని కూడా బయట పెట్టారు. భద్రతా ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టంగా చేసినా.. వచ్చిన అభిమానులను నియంత్రించడం ఒక్కోసారి కష్టంగా మారిపోతుందని అపోలో ఆసుపత్రి ఘటన నిరూపించింది.

44
చిరంజీవికి ఒకేఒక్క మనవడు
Image Credit : Ram charan Konidela/Instagram

చిరంజీవికి ఒకేఒక్క మనవడు

రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనకు కవల పిల్లలు జన్మించడంతో మెగా కుటుంబంలోనే కాదు, మెగా అభిమానుల్లో కూడా ఆనందం పెరిగింది. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసనలకు క్లీన్ కారా అనే కుమార్తె ఉంది. ఇప్పుడు కవల పిల్లలు రావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. కవల పిల్లల్లో ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలతో నింపేశారు. అలాగే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు కూడా రామ్ చరణ్ దంపతులకు అభినందనలు తెలియజేశారు. కవల పిల్లల రాకతో రామ్ చరణ్- ఉపాసనలకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు అయ్యారు. చిరంజీవికి ఇప్పుడు ఒకే ఒక్క మనవడు, ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Idli Batter: మల్లెపువ్వులాంటి మెత్తటి ఇడ్లీ కోసం పిండి ఇలా కలపండి
Recommended image2
Cigarette Price Hike: ఒక్కో సిగరెట్‌పై ఎంత పెరిగిందో తెలుసా? జేబుకు చిల్లు పడిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved