MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ కు అరుదైన గౌరవం, అంబాని పెళ్ళి నుంచి అటు చెక్కేసిన మెగా పవర్ స్టార్..?

రామ్ చరణ్ కు అరుదైన గౌరవం, అంబాని పెళ్ళి నుంచి అటు చెక్కేసిన మెగా పవర్ స్టార్..?

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ రీసెంట్ గా అంబాని పెళ్ళిలో మెరుపులు మెరిపించాడు.. ఆతరువాత కనిపించలేదు.. ఇటు హైదరాబాద్ కూడ రాలేదు.. మరి ఎటు వెళ్లినట్టు.. అటు నుంచ అటే సరాసరి ఫారెన్ చెక్కేశాడా...? తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అసలు సంగతేంటంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 18 2024, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు. రెండు పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉండగా.. రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆసినిమాలపై అంచనాలు అందనంత ఎత్తుకు వెళ్ళిపోతున్నాయి. అంతే కాదు.. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అందుకున్న తరువాత నుంచి రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఎన్నో గౌరవాలు.. మరెన్నో సత్కారాలు.. ఆయన అకౌంట్ లో పడిపోతున్నాయి. 

జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?

28

రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా.. కేంద్రం నుంచి కూడా చరణ్ ఎన్నో గౌరవాలు అందుకున్నారు. అంతే కాదు హాలీవుడ్ రేంజ్ లో అవతార్ దర్శకుడు జేమ్స్ కామరూన్ కూడా చరణ్ నటనను.. ఆయన బిహేవియర్ ను పొగుడుతూ.. శభాష్అన్నాడంటే.. చరణ్ రేంజ్ ఏక్కడికి ఎగబాకిందో అర్ధం అవుతూనే ఉంది. ఈక్రమంలో రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. అవును ఆయన మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడట. ఇంతకీ విషయం ఏంటంటే..?

రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

38

గేమ్ ఛేంజర్ సినిమాలో తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు.. త్వరలో బుచ్చిబాబు సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. ఈక్రమంలో రీసెంట్ గా  ఫ్యామిలీతో కలసి అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లిన రామ్‌చరణ్‌… అక్కడ నుండి స్పెషల్ ప్లైట్‌లో లండన్ చెక్కెశాడట. ఇంతకీ చరణ్ లండన్ ఎందుకు వెళ్లాడో తెలుసా.. అక్కడ ఫేమస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నుంచి ఆయనకు  ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అర్ధ అయ్యి ఉంటుంది రామ్ చరణ్ అందుకోబోతున్న గౌరవం ఏంటో.. 

బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?
 

48

లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ వాక్స్ మ్యూజియంకి ఎలాంటి గుర్తింపు ఉందో అందరికి తెలిసిందే.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు.. వారి వారి రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో పెడుతున్నారు. ఇండియా నుంచి కూడా ఎంతో మంది స్టార్స్ మైనపు బొమ్మలు ఇందులో ఏర్పాటు చేశారు.  

58

తెలుగు నుంచి కూడా కొంత మందికి ఈ గౌరవం దక్కింది. అందులో ప్రభాస్, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్ విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ వాక్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బన్నీ బొమ్మ రీసెంట్ గా అందులో యాడ్ చేశారు. 

68

ఇక తాజాగా ఈలిస్ట్ లో ఇప్పుడు రాయ్ చరణ్ పేరు కూడా చేరింది. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు.  లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టాలీవుడ్‌ టాక్‌ మాత్రమే. రామ్ చరణ్‌ స్టార్ డమ్ తో పాటు.. ఆయనకు ఉన్న  పాపులారిటీ దృశ్య వారు ఆయన  మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట. 

78

ఈ క్రమంలో అందుకోసం కొలతలు ఇవ్వడానికే చరణ్ లండన్ వెళ్ళారు అంటున్నారు కొంత మంది సినీ జనాలు. చరణ్ ముందుగానే ఓ 2 వారాలు హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారట. పనిలో పనిగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తయారు చేస్తున్న మైనపు బొమ్మకు అవసరమైన కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే. రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్‌ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట.. 
 

88

ఈ విషయం నిజం అయితే.. రామ్ చరణ్ తో పాటు.. ఆయన ఎంతో ఇష్టపడే కుక్క పిల్లకు కూడా అరుదైన గౌరవం దక్కబోతోంది. ఇక ఈ విషయం తెలిసి మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. పండగ చేసుకుంటున్నారు. 
  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
పవన్ కళ్యాణ్
ప్రభాస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Recommended image2
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
Recommended image3
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved