MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • `మెగా`బంధం తెంచుకున్నట్టేనా? రామ్ చరణ్‌ విషయంలో మరోసారి దొరికిపోయిన అల్లు అరవింద్‌

`మెగా`బంధం తెంచుకున్నట్టేనా? రామ్ చరణ్‌ విషయంలో మరోసారి దొరికిపోయిన అల్లు అరవింద్‌

mega-allu family controversy: అల్లు ఫ్యామిలీ.. `మెగా` ఫ్యామిలీ నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నారా? తాజాగా అల్లు అరవింద్ `మెగా` సంభోధన ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 11 2025, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Allu Aravind again comments on Ramcharan

Allu Aravind again comments on Ramcharan

mega-allu family controversy: టాలీవుడ్‌లో చిరంజీవి, అల్లు అరవింద్‌ ఫ్యామిలీ అంతా కలిపి మెగా ఫ్యామిలీగానే పరిగణిస్తుంటారు. కానీ ఇటీవల రెండు ఫ్యామిలీల మధ్య దూరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా `మెగా` నీడ నుంచి అల్లు ఫ్యామిలీ బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ రియాక్షన్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Chiranjeevi, allu arjun

Chiranjeevi, allu arjun

`పుష్ప 2` వంటి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన అల్లు అర్జున్‌ మెగా ఫ్యామిలీ నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. గత ఏపి ఎన్నికల్లో మామయ్య అయిన పవన్‌ కళ్యాణ్‌  జనసేనకి సపోర్ట్ చేయకుండా వైసీపీకి చెందిన నాయకుడికి అల్లు అర్జున్‌ సపోర్ట్ చేయడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి.

`పుష్ప 2` సినిమా సమయానికి అవి పీక్‌లో కనిపిస్తూ వచ్చాయి. బన్నీ వివాదంలో ఇరుకున్నప్పుడు కూడా దీనిపై చర్చ నడిచింది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ ఇంకా మెగా హీరోగానే ఉండిపోవడానికి ఇష్టపడటం లేదని, అల్లు బ్రాండ్‌ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. 

37
Allu Aravind, Ram Charan

Allu Aravind, Ram Charan

దీనికి మరింత ఆజ్యం పోశాడు నిర్మాత, బన్నీ నాన్న అల్లు అరవింద్‌. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ `చిరుత` యావరేజ్‌ మూవీ అన్నారు. అలాగే రామ్‌ చరణ్‌ కోసం తాను రిస్క్ చేసి `మగధీర` నిర్మించానని చెప్పారు.

`తండేల్‌` ఈవెంట్‌లో దిల్‌ రాజుని సంభోదిస్తూ ఓ మూవీని పడేసి, మరో మూవీతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడని కాస్త సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యాడు. అది పెద్ద రచ్చ అయ్యింది. మెగా ఫ్యాన్స్ ట్రోల్‌ చేశారు. దీనిపై ఆ మధ్య రియాక్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపించలేదు. నో కామెంట్‌ అంటూ వదిలేశారు. 

47
Sai Pallavis Thandel film collection report out

Sai Pallavis Thandel film collection report out

కానీ ఆ ప్రభావం `తండేల్‌` సినిమాపై గట్టిగానే పడింది. సినిమాకి మెగా ఫ్యాన్స్ ఆదరణ కరువైందని తెలుస్తుంది. కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తగ్గారు అల్లు అరవింద్‌. ఆయన సోమవారం పైరసీ గురించి మాట్లాడుతూ,

చరణ్‌ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా అన్నది కాదు అని, తనకున్న ఏకైక మేనల్లుడు చరణ్‌, ఆయనకున్న ఏకైక మేనమామ నేను అని తెలిపారు అల్లు అరవింద్‌.

57

అయితే ఈ సందర్భంగా `మెగా` ఫ్యాన్స్ క్షమాపణలు అంటూ అల్లు అరవింద్‌ సంభోధించడం మరింత రచ్చగా మారింది. అల్లు, చిరు ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీనే కదా, మళ్లీ `మెగా` ఫ్యామిలీ ఏంటి? అనేది కొత్త ప్రశ్నగా, కొత్త అనుమానాలకు తావిస్తుందంటున్నారు నెటిజన్లు.

అల్లు అరవింద్‌ కూడా `అల్లు` వేరు, `మెగా` వేరు అనే విసయాన్ని చెప్పకనే చెప్పారని, మెగా బంధం తెంచుకున్నట్టే కనిపిస్తుందని నెటిజన్లు మరింతగా రచ్చ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. 

67
Allu Arjun

Allu Arjun

 అల్లు అరవింద్‌ ఈ క్షమాపణలకు కూడా ఓ కారణం ఉంది. ఆదివారం `లైలా` ఈవెంట్‌లో చిరంజీవి `పుష్ప 2` గురించి మాట్లాడారు. `పుష్ప 2` బ్లాక్‌ బస్టర్‌ అయ్యిందని, అందుకు తాను సంతోషిస్తానని, అదే సమయంలో తన ఫ్యామిలీలో హిట్‌ కొడితే తాను గర్వపడతానని చెప్పారు.

అంటే అల్లు వారిని కూడా ఆయన తన ఫ్యామిలీలాగే పరిగణించారు. `పుష్ప2`కి ఎలివేషన్‌ ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్‌ కూడా రామ్‌ చరణ్ సినిమాల విషయంలో తాను చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పారని అర్థమవుతుంది.
 

77

 దిల్‌ రాజు ముందు అన్న కామెంట్లకే ఆయన వివరణ ఇచ్చారు. `చిరుత` యావరేజ్‌ అనేదానికి రియాక్ట్ కాలేదు. ఇది తనకు ఎమోషనల్‌ కి సంబంధించిన విషయం అని, దీన్ని పక్కదారి పట్టించోద్దు అని అల్లు అరవింద్‌ చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్‌ ఉందనేది స్పష్టమవుతుంది.

`మెగా` నీడ నుంచి బయటకు రావాలని అల్లు ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే విషయం అర్థమవుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. ఏదైనా సందర్భంలో రెండు కుటుంబాలు కలిస్తే ఈ రూమర్స్ కి చెక్‌ పెట్టే అవకాశం ఉంది. లేదంటే ఈ రూమర్స్ కంటిన్యూనే అవుతాయి. 

read more: Allu Aravind : నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు రాంచరణ్, దయచేసి ఇక ఆపేయండి.. అల్లు అరవింద్ ఎమోషనల్

also read: Bhanupriya: జ్ఞాపకశక్తి కోల్పోయిన భానుప్రియ.. సీనియర్‌ నటి బాధాకర జీవితం

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved