MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే

Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే

రాంచరణ్ నటించిన పెద్ది మూవీ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. రాంచరణ్ పెద్ది సక్సెస్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 08 2026, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ
Image Credit : Asianet News

రాంచరణ్ పెద్ది మూవీ

రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకి అద్భుతమైన స్పందన దక్కుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. నాలుగు రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పెద్ది చిత్రం 108 కోట్ల వరకు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 150 కోట్ల షేర్ కు చేరువైంది. దీనితో చిత్ర యూనిట్ తాజాగా థాంక్యూ మీట్ నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేను ఇష్టపడి చేశా
Image Credit : others

నేను ఇష్టపడి చేశా

ఈ థాంక్యూ మీట్ కి రాంచరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, నిర్మాతలు హాజరయ్యారు. రాంచరణ్ థాంక్యూ మీట్ లో పెద్ది సక్సెస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది లాంటి సినిమా చేయమని నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. నాకు నేను స్వతహాగా నిర్ణయించుకుని చేశా. నేను ఇష్టపడి చేసిన పనికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండడంతో నా సంతోషం మాటల్లో చెప్పలేకున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నా అని రాంచరణ్ అన్నారు.

Related Articles

Related image1
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Related image2
Priya Bapat: సాంగ్ షూట్‌లో హీరో బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆ నరకాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న నటి
35
క్లాస్ థియేటర్ లో మాస్ రచ్చ
Image Credit : X

క్లాస్ థియేటర్ లో మాస్ రచ్చ

ప్రసాద్ ఐమాక్స్ లో ఈ సినిమా చూశా. క్లాస్ థియేటర్ కదా, ఆడియన్స్ సైలెంట్ గా ఉంటారని అనుకున్నా. కానీ సింగిల్ స్క్రీన్ తరహాలో గోల చేస్తూ ప్రతి సీన్ కి క్లాప్స్ కొడుతున్నారు. బుచ్చిబాబు ఈ కథని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా అతడిని హగ్ చేసుకున్నా.

45
ఇది రిస్క్ తో కూడుకున్న కథ అని తెలుసు
Image Credit : Asianet News

ఇది రిస్క్ తో కూడుకున్న కథ అని తెలుసు

కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్న కథ అని ఆ తర్వాత అర్థం అయింది. ఈ సినిమా హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే.. మనస్ఫూర్తిగా ఎవరైనా సరే స్వచ్ఛమైన మనసుతో కష్టపడి పని చేస్తే సక్సెస్ దక్కాల్సిందే. అది పెద్ది చిత్రంతో ప్రూవ్ అయింది అని రాంచరణ్ అన్నారు.

55
అలాంటి గ్రామాల్లో ఉండేవారి కథే ఇది
Image Credit : Asianet News

అలాంటి గ్రామాల్లో ఉండేవారి కథే ఇది

డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నిజాయతీయగా ఒక కథ చెప్పాలని అనుకున్నా. ఇండియాతో కనెక్షన్ లేకుండా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. గ్రామాల్లో అలవోకగా బరువైన బస్తాలు మోసే వ్యక్తులని చూశాను. వాళ్ళు ఇండియా తరుపున వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొంటే మెడల్ తీసుకువస్తారు కదా అని అనిపించేది. అదే విధంగా సముద్రంలో ఎలాంటి సేఫ్టీ లేకుండా ఈదే ఈతగాళ్ళని చూశాను. వాళ్ళందరి కథే ఈ పెద్ది చిత్రం అని బుచ్చిబాబు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Recommended image2
Priya Bapat: సాంగ్ షూట్‌లో హీరో బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆ నరకాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved