రామ్ చరణ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారారు. ఆస్కార్ రేంజ్ కు వెళ్ళిన ఈ హీరో.. హాలీవుడ్ ను కూడా టచ్ చేయబోతున్నాడు. మరి ఈ మెగా హీరోకి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన బలంతో.. వరుస ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు . ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ రాబోతుంది. సంక్రాంతి సందర్భంగా 2025 జనవరిలో ఈసినిమా ఫ్యాన్స్ ను అలరించబోతోంది. కాగా రామ్ చరణ్ ఈసినిమా తరువాత బుచ్చిబాబు సాన డైరెక్షన్ లోమూవీ ఓపెనింగ్ జరిగిపోయింది. షూటింగ్ లోకి వెళ్ళడమే తరువాయి.
ramcharan
ఇక రామ్ చరణ్ తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో నటించాడు. అందరు హీరోయిన్లు రామ్ చరణ్ తో నటించడం తాము బాగా ఎంజాయ్ చేస్తామంటూ చెపుతుంటారు. ఇక చరణ్ కూడా హీరోయిన్లకు ఆ కంఫర్ట్ జోన్ ఇస్తుంటాడు. అయితే రామ్ చరణ్ కు ఫస్ట్ క్రష్ ఎవరంటే హాలీవుడ్ హీరోయిన్ పేరు చెప్పాడు ఓ సందర్భంలో. అయితే మన ఇండియాన్ హీరోయిన్లు.. ప్రత్యేకంగా తనతో నటించిన హీరోయిన్లలో ఎవరు ఇష్టం అని అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు చరణ్.
రామ్ చరణ్ కు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు.. బాగా ఇష్టమైన సినిమా ఏది..? ఈ విషయంలో స్యయంగా క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? ఆమధ్య ఆస్కార్ తీసుకునే టైమ్ లో ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూల ఇచ్చారు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూలో ఆయన రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా తనకు బాగా ఇష్టమైన సినిమా మగధీర అనిచెప్పారు. అంతే కాదు రంగస్థలం, ఆరెంజ్ సినిమాలన్నా కూడా తనకు బాగా ఇష్టమని చెప్పారు.
ఇక మగధీర తన కెరీర్ ను టర్న్ చేసిందని అన్నారు చరణ్. అంతే కాదు ఈసినిమా లాండ్ మార్క్ అని.. అభిమానుల్లో కూడా చాలామందికి ఈ సినిమా అంటేనే ఇష్టం అన్నారు. ఇక రామ్ చరణ్ కు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే..? ఈ తరం హీరోయిన్లలో చరణ్ కు సమంత యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఇక హీరోలలో రామ్ చరణ్ కు తమిళ స్టార్ సూర్య నటన అంటే బాగా ఇష్టమని తెలుస్తోంది.
Ram Charan
ఇక రామ్ చరణ్ ఇంత వరకూ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు.. కాని కామెడీ ట్రై చేయలేదు. అయితే బుచ్చిబాబుతో చేసే సినిమా కాంమెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. ఈరకంగా తన సినిమాపై ఫ్యాన్స్ కు అదరిపోయే అప్ డేట్ ను ఇవ్వకనే ఇచ్చారు చరణ్. గేమ్ ఛేంజర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక బుచ్చిబాబు సినిమా పై కూడా అంచనాలు పెంచేశాడు చరణ్.