- Home
- Entertainment
- గేమ్ ఛేంజర్ చిత్రానికి రాంచరణ్ రెమ్యునరేషన్ అంత తక్కువా ? ఎందుకు తగ్గించుకున్నాడో తెలుసా
గేమ్ ఛేంజర్ చిత్రానికి రాంచరణ్ రెమ్యునరేషన్ అంత తక్కువా ? ఎందుకు తగ్గించుకున్నాడో తెలుసా
దాదాపు మూడేళ్ళ నుంచి గేమ్ ఛేంజర్ చిత్రం డిలే అవుతూనే ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో రాంచరణ్ రెమ్యునరేషన్ ఎంత అనే సందేహం రావచ్చు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం మరో వారం రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతోంది. దీనితో చిత్ర యూనిట్ త్వరలో ఏపీలో మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు.
దాదాపు మూడేళ్ళ నుంచి గేమ్ ఛేంజర్ చిత్రం డిలే అవుతూనే ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో రాంచరణ్ రెమ్యునరేషన్ ఎంత అనే సందేహం రావచ్చు. చరణ్ కి ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఏ పాన్ ఇండియా హీరో గురించి మాట్లాడుకున్న మినిమమ్ 100 కోట్ల రెమ్యునరేషన్ అంటూ ప్రచారం జరుగుతోంది.
చరణ్ కూడా గేమ్ ఛేంజర్ చిత్రానికి ముందుగా 100 కోట్ల దగ్గరగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే చరణ్ కి ఈ చిత్రం ద్వారా చాలా తక్కువ రెమ్యునరేషన్ దక్కినట్లు తెలుస్తోంది. చరణ్ ఈ చిత్రానికి రూ 65 కోట్లు మాత్రమే తీసుకున్నారట. చరణ్ ఇంత తక్కువ పారితోషికానికి ఎందుకు అంగీకరించారు అనే దానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి.
Also Read: SSMB 29: 1000 కోట్ల బడ్జెట్, రాజమౌళి, మహేష్ వాటా ఎంతో తెలుసా.. అంతర్జాతీయ ఒప్పందాలు ఇవే ?
ప్రధాన కారణం ఈ చిత్రం మూడేళ్లు ఆలస్యం కావడం వల్ల నిర్మాతకి ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయిందట. దీనితో బడ్జెట్ లెక్కకి మించి ఎక్కువ అయింది. దీనితో రాంచరణ్ తో పాటు శంకర్ కూడా రెమ్యునరేషన్ తగ్గించుకున్నారట. శంకర్ ఈ చిత్రానికి 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాలు వస్తే వాటా అందుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.