రాజమౌళి సినిమాల్లో నష్టాలు తెచ్చింది అదొక్కటే.. జక్కన్నతో రజనీకాంత్ కాంబినేషన్ ఎందుకు ఆగిపోయిందంటే
రజనీకాంత్, రాజమౌళి ఇండియన్ సినిమాలో వీరిద్దరూ టాప్ పొజిషన్ కి చేరుకున్న వ్యక్తులు అని చెప్పడంలో సందేహం లేదు. రజనీకాంత్ ఇండియన్ సినిమాపై సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. రాజమౌళి పాన్ ఇండియా చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.
రజనీకాంత్, రాజమౌళి ఇండియన్ సినిమాలో వీరిద్దరూ టాప్ పొజిషన్ కి చేరుకున్న వ్యక్తులు అని చెప్పడంలో సందేహం లేదు. రజనీకాంత్ ఇండియన్ సినిమాపై సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. రాజమౌళి పాన్ ఇండియా చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన దాదాపుగా ప్రతి ఒక్క అభిమానికి వచ్చి ఉంటుంది. ఒక దశలో రాజమౌళి, రజనీకాంత్ కాంబినేషన్ సెట్ అయింది. ఈ విషయం అందరికీ తెలియదు.
కానీ ఈ కాంబినేషన్ ఎందుకు కార్యరూపం దాల్చలేదు.. రాజమౌళి.. రజనీకాంత్ తో ఎందుకు సినిమా చేయలేదు అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలని నిర్మాత గిరి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రానికి గిరి కూడా ఒక నిర్మాత. నితిన్, జెనీలియా కాంబినేషన్ లో తెరకెక్కిన సై గురించి గిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rajinikanth
సై చిత్రానికి బడ్జెట్ భారీగా ఖర్చు అయింది అని దానివల్ల నిర్మాత నష్టపోయారు అని వార్తలు వచ్చాయి. దీనిపై గిరి మాట్లాడుతూ నాకు సై చిత్రంతో ఎలాంటి లాభాలు రాలేదు. నష్టాలే వచ్చాయి. కానీ ఆ నష్టం మరీ ఎక్కువ ఏమీ కాదు. కొంత లాస్ వచ్చిన మాట నిజమే అని గిరి అన్నారు. ఆ విషయం రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా తెలుసు. దీనితో వాళ్లిద్దరూ నాతో ఒక మాట చెప్పారు. మనం ఇంకొక సినిమా చేద్దాం సర్.. కానీ తొందరపడకండి.. నిదానంగా చేద్దాం అని చెప్పారు.
ఒక టైంలో రాజమౌళి రజనీకాంత్ తో సినిమా చేద్దాం అనుకున్నారు. నేను ఏఎం రత్నం ద్వారా రజనీకాంత్ నుంచి రాజమౌళికి ఫోన్ చేయించాను. ఇద్దరూ ఒకే సినిమా చేద్దాం అని హ్యాపీగా అంగీకరించారు. రాజమౌళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత చర్చలు జరిగాయి. కానీ ఇద్దరి షెడ్యూల్స్ బాగా టైం అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ లోకి ఏఎం రత్నం కూడా వస్తారేమో అనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల రాజమౌళి, రజనీకాంత్ కాంబినేషన్ ముందుకు వెళ్ళలేదు అని గిరి అన్నారు.
విక్రమార్కుడు, యమదొంగ చిత్రాల తర్వాత రాజమౌళి చిన్న బడ్జెట్ లో సినిమా చేసి ఉంటే నేను నిర్మించేవాడిని. కానీ ఆయన మగధీర చేశారు. అంత భారీ బడ్జెట్ పెట్టే స్థితిలో నేను లేను. అందుకే రాజమౌళితో సై తర్వాత సినిమా చేయలేకపోయా అని గిరి అన్నారు.