SSMB 29: 1000 కోట్ల బడ్జెట్, రాజమౌళి, మహేష్ వాటా ఎంతో తెలుసా.. అంతర్జాతీయ ఒప్పందాలు ఇవే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ విషయంలో ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. జనవరి 2 అంటే నేడే ఈ చిత్రం లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా లాంచ్ విషయంలో రాజమౌళి పెద్దగా హంగామా చేయడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ విషయంలో ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. జనవరి 2 అంటే నేడే ఈ చిత్రం లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా లాంచ్ విషయంలో రాజమౌళి పెద్దగా హంగామా చేయడం లేదు. ఎందుకంటే సినిమా లాంచ్ కి మహేష్ బాబు హాజరు అయ్యే అవకాశాలు తక్కువ. సెంటిమెంట్ ప్రకారం మహేష్ బాబు తన చిత్రాల ప్రారంభోత్సవానికి హాజరుకారు.
ప్రతి చిత్రానికి ముందు రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించి విశేషాలు ప్రకటిస్తారు. బహుశా మహేష్ మీడియా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుంది అనే క్లారిటీ లేదు. ప్రస్తుతం మహేష్ బాబు ఫారెన్ లో ఉన్నాడని కొందరు, హైదరాబాద్ లోనే ఉన్నారని మరికొందరు చెబుతున్నారు.
సినిమా లాంచ్ విషయం పక్కన పెడితే కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవల ఆధారంగా రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి తనకి కావలసిన విధంగా విజయేంద్ర ప్రసాద్ తో కథ రాయించుకున్నారు. ఈ చిత్రానికి 1000 కోట్ల బడ్జెట్ అవసరం. రెండు భాగాల్లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కెఎల్ నారాయణ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలనేది రాజమౌళి ప్లాన్. దీని కోసం అంతర్జాతీయ టెక్నిషియన్స్ ని రాజమౌళి హైర్ చేసుకుంటున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో రాజమౌళి ఈ చిత్రం కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిస్ని లాంటి సంస్థలు తమ చిత్రాలని వరల్డ్ వైడ్ గా ఎలా మార్కెటింగ్ చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అలాంటి సంస్థల్ని ఈ చిత్రంలో భాగస్వాములుగా చేస్తే హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయవచ్చు అనేది రాజమౌళి ప్లాన్. అందుకే డిస్ని, సోని లాంటి సంస్థల భాగస్వామ్యం ఈ చిత్రంలో ఉండొచ్చు అని అంటున్నారు. ఆ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయట.
ఇక రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే సింహభాగం రెమ్యునరేషన్ అందుకునేది మహేష్ బాబు, రాజమౌళినే. ఈ చిత్రం కోసం మహేష్, రాజమౌళి స్ట్రాటజీ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి, మహేష్ ఇద్దరూ తమ ప్రతి చిత్రంలో కొంత భాగం షేర్ తీసుకుంటారు. కానీ ఈ చిత్రానికి మాత్రం వీరిద్దరి వాటా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం మహేష్ బాబు, రాజమౌళి 40 శాతం వాటా తీసుకోబోతున్నారట. ఇద్దరూ రెమ్యునరేషన్ బాగా తగ్గించుకుని వాటా ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఏది ఏమైనా ఈ చిత్రం లాంచ్ తర్వాత రాజమౌళి ఎలాంటి విషయాలు రివీల్ చేస్తారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.