MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Chiranjeevi Review: `పెద్ది` రెండో సాంగ్‌ `రై రై రా రా`పై చిరంజీవి రివ్యూ.. పాట పూర్తి లిరిక్‌ ఇదే

Chiranjeevi Review: `పెద్ది` రెండో సాంగ్‌ `రై రై రా రా`పై చిరంజీవి రివ్యూ.. పాట పూర్తి లిరిక్‌ ఇదే

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తోన్న `పెద్ది` సినిమా నుంచి రెండో పాట వచ్చింది. `రై రై రారా` అంటూ సాగే పాటపై చిరంజీవి తన రివ్యూ ఇచ్చారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 03 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది మూవీ నుంచి సెకండ్‌ సాంగ్‌
Image Credit : Asianet News

పెద్ది మూవీ నుంచి సెకండ్‌ సాంగ్‌

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` మూవీ రూపొందుతుంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శివ రాజ్‌ కుమార్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వెంకట సతీష్‌ కిలారు నిర్మించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే `చికిరి` సాంగ్‌ విడుదలై రికార్డు వ్యూస్‌ ని సాధించింది. ఇప్పుడు రెండో పాటని విడుదల చేశారు. `రై రై రారా` అంటూ సాగే పాటని చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉర్రూతలూగిస్తోన్న `రై రై రారా` సాంగ్‌
Image Credit : Asianet News

ఉర్రూతలూగిస్తోన్న `రై రై రారా` సాంగ్‌

ఫాస్ట్ బీట్‌తో సాగే పాట ఆకట్టుకుంటుంది. జోష్‌ నింపేలా ఉంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. వేగంగా సాగే ఈ పాటలో రామ్‌ చరణ్‌ కూడా అంతే వేగంగా స్టెప్పులు వేయడం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. దీంతో వారంతా   ఈ పాటకి స్టెప్పులేస్తున్నారు. రెహ్మాన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటని అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. రెహ్మాన్‌ స్వయంగా ఆలపించారు. పాట వినే కొద్ది ఇంట్రెస్టింగ్‌గా, ఆకట్టుకుంటోంది. చరణ్‌ డాన్సులు ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి. సాంగ్‌ విడుదల సందర్భంగా చిరంజీవి తన రివ్యూ ఇచ్చారు.

Related Articles

Related image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Related image2
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
35
రైరై రారా పాటపై చిరంజీవి రివ్యూ
Image Credit : Chiranjeevi\Twitter

రైరై రారా పాటపై చిరంజీవి రివ్యూ

`పెద్ది`లోని `రై రై రారా` అనే పాట తెరపై ఒక మెరుపులా, వక్తి, భావోద్వేగం, సినిమాటిక్‌ బ్రిలియన్స్ తో అద్భుతంగా ఉంది. రామ్‌ చరణ్‌ని చూడటం నాకు అపారమైన గర్వాన్ని నింపుతుంది. అతని మూమెంట్స్ అబ్బురపరుస్తున్నాయి. అద్భుతంగా సినిమాని రూపొందిస్తున్న బుచ్చిబాబు సానా, మంచి ట్యూన్స్ అందిస్తున్న రెహ్మాన్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌లకు అభినందనలు. అద్భుతమైన విజువల్స్ అందించిన రత్నవేలు, అర్థవంతమైన పాట రాసిన అనంత శ్రీరామ్‌, సినిమాని నిర్మించిన సతీష్‌ కిలారులకు అభినందనలు. పెద్ద అనేక మైలురాళ్లని సాధించాలని కోరుకుంటున్నా` అని తెలిపారు చిరంజీవి.

#RaiRaiRaaRaa from #Peddi is sheer fire on screen, a stunning blend of energy, emotion, and cinematic brilliance.

Watching @AlwaysRamCharan light up the screen with effortless grace and electrifying speed fills me with immense pride. The way he moves is a joy to watch!

Kudos to… pic.twitter.com/98Wc25JCpT

— Chiranjeevi Konidela (@KChiruTweets) March 3, 2026

45
తనదైన ఎనర్జీ, గ్రేస్‌తో రచ్చ చేసిన రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

తనదైన ఎనర్జీ, గ్రేస్‌తో రచ్చ చేసిన రామ్‌ చరణ్‌

ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్ ప‌ల్సేటింగ్ బీట్స్, ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌తో అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది. స్టార్ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ, భారతీయ సినిమాలోనే అత్యంత భారీ, ఎలక్ట్రిఫైయింగ్ ఇంట్రడక్షన్ నంబర్‌లలో ఒకటిగా నిలిచేలా రూపుదిద్దుకుంది. రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ ఫినెస్ తో అదరగొట్టారు. ఆయన ఫ్లూయిడ్ మూవ్‌మెంట్స్, పవర్‌ఫుల్ ఫుట్‌వర్క్, కరిస్మాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను వైరల్‌ చేస్తున్నాయి.

55
రై రై రారా పాట పూర్తి సాహిత్యం
Image Credit : Asianet News

రై రై రారా పాట పూర్తి సాహిత్యం

పాట లిరిక్‌ కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో చాలా పెద్ద మీనింగ్‌ ఉంది. అదేంటో చూడండి.

రైరై రారా రైరై రారా

అడ్డేలేని దారై రారా

రైరై రారా రైరై రారా

హద్దేలేని తీరై రారా

దూకేటి దూరైరా

పోరాడేట్టి పోరైరా

ఆరు నూరైనా మందల్లోంచి వేరైరా

భయ్యం పీకి పారేయ్‌రా సిగ్గుంటే సీరైరా

జేకొట్టె పేరైరా

నీ రాకచూసి లోకం చేసే హోరై రారా

బెరుగ్గా ఇరుగ్గా పాతేసుకోకోయలా

నిను నిన్నే నీ లోపలా

పాతికేళ్లకే నువు పాతబడిపోకురా

నిన్నటిలాగే రేపున్నదంటే

ఈ రోజేం పీకావనీ

నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే

నువ్వేమి పొడిచావనీ

మొండెంలో తల దించేటట్లయితే

మొలతాడెందుకు కట్టావ్ తెంచేసెయ్

నువ్ మొత్తం రక్తం మార్చుకొనొచ్చేసెయ్

ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్

నీ ఆట బతకాలిరోయ్

మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్

గెలుపై నువ్ వెలగాలిరోయ్

మండే గుండె నీలో లేదంటే

కాలూ చెయ్యీ ఉన్నా లేనట్టే

నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Missamma: పెళ్లి వద్దు, సింగిల్ లైఫ్ ముద్దు అంటున్న హీరోయిన్.. మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ అదుర్స్
Recommended image2
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Recommended image3
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Related Stories
Recommended image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image2
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved