MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?

Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?

నార్త్ ఇండియాలో పెద్ది భారీ ఎత్తున రిలీజ్ కి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పెద్ది మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 27 2026, 09:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
Image Credit : Asianet News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ‘పెద్ది పహెల్వాన్ గ్లింప్స్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ శారీరక దృఢత్వం, పాత్రలో ఆయన చూపించిన నిబద్ధత సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన వ్యక్తం చేస్తున్నారు.

25
ర్శకుడు బుచ్చి బాబు సానా
Image Credit : Asianet News

ర్శకుడు బుచ్చి బాబు సానా

ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్నారు. ఆయన ప్రదర్శన శైలి, రామ్ చరణ్ పాత్రను చూపించిన విధానం ప్రేక్షకులను బలంగా ఆకర్షించినట్లు సమాచారం. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. స్పోర్ట్స్ నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా ‘పెద్ది’ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ మూవీ రికార్డులని అధికమించేలా పెద్ది మూవీ రిలీజ్ నార్త్ ఇండియాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసక్తికర అప్డేట్ వైరల్ గా మారింది.

Related Articles

Related image1
బాలకృష్ణతో సెట్ చేద్దాం అంటే భయంగా ఉంది.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్లాప్ మూవీపై నాగార్జున సెటైర్
Related image2
రాంచరణ్ పుట్టినరోజున తన అవార్డు త్యాగం చేసిన చిరంజీవి.. ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఫోటోలు బయటకి తీసిన మెగాస్టార్
35
పెద్ది చిత్ర హిందీ వెర్షన్‌
Image Credit : Instagram/peddimovie

పెద్ది చిత్ర హిందీ వెర్షన్‌

తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ చిత్ర హిందీ వెర్షన్‌ను జియో స్టూడియోస్ విడుదల చేయనుంది. ఈ బ్యానర్ ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ధురంధర్ ది రివెంజ్’ చిత్రాన్ని కూడా విడుదల చేసింది. దీంతో ‘పెద్ది’ హిందీ మార్కెట్‌లో విస్తృత స్థాయిలో విడుదల కావడానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

45
కథానాయికగా జాన్వీ కపూర్
Image Credit : Youtube/Screengrab

కథానాయికగా జాన్వీ కపూర్

‘పెద్ది’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

55
సినిమా పై అంచనాలు
Image Credit : instagram

సినిమా పై అంచనాలు

సంగీతాన్ని ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు వచ్చిన స్పందనతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. హిందీ వెర్షన్‌ను ప్రముఖ బ్యానర్ విడుదల చేయడం ద్వారా ‘పెద్ది’ ఉత్తర భారత మార్కెట్‌లో కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
పోకిరి సెట్‌లో గొడవ.. 19 ఏళ్లుగా స్టార్ హీరోతో మాట్లాడని సీనియర్ నటుడు, ఏం జరిగిందో తెలుసా ?
Recommended image2
Dil Raju: మున్నా సినిమా చూసి ప్రభాస్‌కు వెళ్లి సారీ చెప్పాను.. అప్పుడు డార్లింగ్ ఓ మాట అన్నాడు
Recommended image3
రాంచరణ్ పుట్టినరోజున తన అవార్డు త్యాగం చేసిన చిరంజీవి.. ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఫోటోలు బయటకి తీసిన మెగాస్టార్
Related Stories
Recommended image1
బాలకృష్ణతో సెట్ చేద్దాం అంటే భయంగా ఉంది.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్లాప్ మూవీపై నాగార్జున సెటైర్
Recommended image2
రాంచరణ్ పుట్టినరోజున తన అవార్డు త్యాగం చేసిన చిరంజీవి.. ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఫోటోలు బయటకి తీసిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved