బాలయ్య షోలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ ప్రస్తావన వస్తుందా? ఏం జరగనుంది?
అన్ స్టాపబుల్ సీజన్ 4 ఇటీవల మొదలైంది. పలువురు గెస్ట్స్ షోలో పాల్గొన్నారు. నెక్స్ట్ గెస్ట్ రామ్ చరణ్. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది.
photo credit-aha unstoppable 4
అన్ స్టాపబుల్ షోతో తనలోని కొత్త యాంగిల్ పరిచయం చేశాడు బాలకృష్ణ. ఆహా లో ప్రసారం అవుతున్న ఈ టాక్ షో అనేక రికార్డ్స్ బద్దలు కొట్టింది. భారీ వ్యూవర్షిప్ సొంతం చేసుకుంది. ఒక టాక్ షోకి బాలయ్య హోస్ట్ అంటూ వార్తలు రాగా పలువురు పెదవి విరిచారు. ఆఫ్ స్క్రీన్ లో బాలయ్యకు మాట్లాడటం రాదు. ఈ షో అట్టర్ ప్లాప్ అని అంచనా వేశారు. ఈ అంచనాలు తలక్రిందులు చేస్తూ.. అన్ స్టాపబుల్ షో ట్రెమండస్ సక్సెస్ అయ్యింది. బాలయ్య హోస్టింగ్ స్కిల్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
Ram Charan
సక్సెస్ఫుల్ గా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో.. సీజన్ 4లో అడుగుపెట్టింది. దసరా అనంతరం సీజన్ 4 అందుబాటులోకి తెచ్చారు. అల్లు అర్జున్, దుల్కర్, సూర్య వంటి టాప్ స్టార్స్ ఈ సీజన్లో అతిథులుగా పాల్గొన్నారు. తమ కొత్త చిత్రాలను ప్రమోట్ చేసుకున్నారు. ఈసారి రామ్ చరణ్ వంతు. ఆయన నటించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న విడుదల కానుంది. దీనిలో భాగంగా అన్ స్టాపబుల్ షో నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ సందడి చేయనున్నాడు. ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన కూడా చేసింది.
Ram Charan
అయితే రామ్ చరణ్ రావడం వలన బాలయ్య ఒకింత ఇరుకున పడే అవకాశం ఉంది. రామ్ చరణ్ కెరీర్లో ఆర్ ఆర్ ఆర్ అతిపెద్ద హిట్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది. కాబట్టి బాలయ్య కచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తావన తేవాల్సిందే.
ఆర్ ఆర్ ఆర్ మూవీ చర్చకు వస్తే... బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా ఎన్టీఆర్ నటించాడు కాబట్టి ఎన్టీఆర్ నటన గురించో, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించో రామ్ చరణ్ ని బాలకృష్ణ అడగాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిపెట్టిన నాటు నాటు సాంగ్ మేటర్ ఎత్తాల్సిందే. ఎన్టీఆర్ తో బాలయ్యకు కోల్డ్ వార్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో రామ్ చరణ్ ఎపిసోడ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
చాలా కాలంగా బాలయ్య-ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదు. రాజకీయంగా ఏర్పడిన విబేధాలు కొనసాగుతున్నాయనే వాదన ఉంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. బాలకృష్ణ పరిశ్రమకు వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ వెళ్ళలేదు.
బాలయ్యతో గొడవలు, ఆ నటుడి దగ్గర ఓపెన్ అయిన జూనియర్ ఎన్టీఆర్! ఇంతకీ ఏమన్నారు?
ఒక దశలో నందమూరి అభిమానులు బాలయ్య, ఎన్టీఆర్ వర్గాలు విడిపోయి దూషించుకున్నారు. దేవర మూవీపై సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు దుష్ప్రచారం చేయగా, అల్లు అర్జున్ అభిమానులు సపోర్ట్ చేశారు. అలాగే మోక్షజ్ఞకు పోటీగా ఎన్టీఆర్ తన అన్నయ్య జానకిరామ్ కుమారుడిని పరిశ్రమకు తెస్తున్నాడనే పుకారు కూడా ఉంది. బాలయ్యతో ఎన్టీఆర్ వేదిక పంచుకుని చాలా కాలం అవుతుంది. ఈ పరిణామాల నడుమ రామ్ చరణ్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ప్రస్తావన వస్తే, బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..