బాలయ్యతో గొడవలు, ఆ నటుడి దగ్గర ఓపెన్ అయిన జూనియర్ ఎన్టీఆర్! ఇంతకీ ఏమన్నారు?
బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వాదన చాలా కాలంగా ఉంది. దీనిపై ఓ సందర్భంలో నటుడు జగపతిబాబు స్పష్టత ఇచ్చాడు. బాలయ్యతో నీకు గొడవలు ఎందుకని అడగ్గా... జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్ గా చెప్పాడని వెల్లడించాడు.
నందమూరి కుటుంబం మొత్తం ఒకవైపు... హరికృష్ణ కుటుంబం మరొకవైపు. రాజకీయ విబేధాలు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. ఎన్టీఆర్ మరణం అనంతరం టీడీపీలో హరికృష్ణకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి దూరం అయ్యాడు.
ఎన్నికల అనంతరం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. గత రెండు మూడేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు మరింత చిచ్చు రాజేశాయనే వాదన ఉంది. మేనత్త భువనేశ్వరిని అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు అవమానించారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. భువనేశ్వరి ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అది సరిపోదని టీడీపీ శ్రేణులు విమర్శలు చేశాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ పెదవి విప్పకపోవడంతో టీడీపీ కార్యకర్తలు మరింతగా విమర్శలు గుప్పించారు. తన తాత ఎన్టీఆర్ పేరును జూనియర్ వదిలేయాలంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ సానుభూతిపరులు రెండు వర్గాలుగా విడిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ని ద్వేషిస్తే ఊరుకునేది లేదని ఆయన ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకను, బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబాయ్-అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇద్దరికీ సఖ్యత లేదనే వాదన బలపడింది.
నిజంగానే ఎన్టీఆర్-బాలయ్యలకు పడటం లేదా? గొడవలు పడుతున్నారా? బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ కి ద్వేషమా? అంటూ అనేక ప్రశ్నలు సాధారణ జనాల్లో ఉన్నాయి. నటుడు జగపతి బాబు ఈ విషయంపై నేరుగా జూనియర్ ఎన్టీఆర్ వద్దే క్లారిటీ తీసుకున్నట్లు చెప్పారు. నాన్నకు ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ కి విలన్ గా జగపతిబాబు చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో జగపతి బాబు-జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు.
ఒకసారి నేరుగా ఏంటి మీ బాబాయ్ బాలయ్యతో నీకు సమస్య? ఇద్దరికీ గొడవలు అట కదా? అని అడిగాను. అందుకు జూనియర్ ఎన్టీఆర్... ఆయనతో నాకెందుకు గొడవలు ఉంటాయి. ఆయన మానాన్న తమ్ముడు. నాకు తండ్రితో సమానం. బాలయ్య బాబాయ్ తో నాకు ఎలాంటి సమస్యలు, గొడవలు లేవు. అదంతా ప్రచారం మాత్రమే అని చెప్పాడట. జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలోనే జగపతిబాబు ఈ విషయం చెప్పాడు
కాబట్టి బాలయ్యతో ఎన్టీఆర్ కి ఎలాంటి గొడవలు లేవు. మీడియాలో కొని నిరాధార కథనాలు వెలువడుతున్నాయని నందమూరి డై హార్డ్ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్-బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతుంది. వీరిద్దరూ కలవకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇక బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞను రంగంలోకి దించుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది. నిర్మాతలు మాత్రం ఖండిస్తున్నారు.
'రామారావు' టైటిల్ తో బాలయ్య మూవీ, డైలాగ్ మాత్రం వైల్డ్ .. ఎందుకు ఆగిపోయింది ?
NTR - Balakrishna
మోక్షజ్ఞ ఒక చిత్రం బాలకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడన్న న్యూస్ సైతం కాకరేపుతుంది. ఆదిత్య 369 సీక్వెల్, ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తాడట. మోక్షజ్ఞ-బాలయ్యల కాంబోలో మూవీకి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కొడుకుని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేస్తున్నాడు. మోక్షజ్ఞకు పోటీగానే జానకిరామ్ కొడుకును ఇండస్ట్రీకి తెచ్చారనే వాదన మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు పేరు కూడా ఎన్టీఆరే. వైవిఎస్ చౌదరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నందమూరి వారసుల్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.