- Home
- Entertainment
- పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు..మ్యారేజ్ కి ముందు చరణ్ అలా ఎందుకన్నారంటే
పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు..మ్యారేజ్ కి ముందు చరణ్ అలా ఎందుకన్నారంటే
చిన్నతనంలో నాన్న నాకు అవసరమైనంత స్వేచ్ఛ ఇచ్చారు. కాస్త రిస్క్ అయినప్పటికీ చిన్నతనంలోనే హార్స్ రైడింగ్ నేర్పించారు. అక్క, చెల్లి ఇద్దరూ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ భద్రత దృష్ట్యా కాస్త స్ట్రిక్ట్ గానే పెంచారు.

Upasana Konidela
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. రెండవ చిత్రం మగధీర తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్ ఆ తర్వాత చిత్రాల్లో నటన విషయంలో వచ్చిన విమర్శలని ఒక్కో చిత్రంతో తిప్పికొడుతూ వచ్చారు. రంగస్థలం చిత్రంతో విశ్వరూపం ప్రదర్శించి విమర్శించిన వారిచేతే ప్రశంసలు కురిపించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు అయినప్పటికీ చరణ్ ఒదిగి ఉండే గుణం నేర్చుకున్నారు. తనని నాన్నగారు అలాగే పెంచారని రామ్ చరణ్ తెలిపారు. కెరీర్ బిగినింగ్ లో సీనియర్ హీరోయిన్ జయప్రద నిర్వహించిన ఒక షోకి రాంచరణ్ హాజరయ్యారు. ఆ షోలో జయప్రద అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. చరణ్ తన చిన్ననాటి సంగతులు.. హీరో అయ్యాక ఎదురైనా సవాళ్లు, పెళ్లి విషయంలో తన అభిప్రాయాలు పంచుకున్నారు.
జయప్రద.. చరణ్ ని ఇంటర్వ్యూ చేసే సమయానికి అతడికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ.. చిన్నతనంలో నాన్న నాకు అవసరమైనంత స్వేచ్ఛ ఇచ్చారు. కాస్త రిస్క్ అయినప్పటికీ చిన్నతనంలోనే హార్స్ రైడింగ్ నేర్పించారు. తమిళ నటుడు శివాజీ గణేశన్ తనయుడు ప్రభు గారి ఇంట్లో నాలుగు గుర్రాలు ఉండేవి. వాటితో హార్స్ రైడింగ్ నేర్చుకున్నా.
అక్క, చెల్లి ఇద్దరూ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ భద్రత దృష్ట్యా కాస్త స్ట్రిక్ట్ గానే పెంచారు. కానీ నాకు మాత్రం స్వేచ్ఛ ఇచ్చారు. హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వల్ల గుర్రాలపై ఇష్టం ఏర్పడింది. నాకు కూడా సొంతంగా గుర్రాలు ఉన్నాయి అని చరణ్ పేర్కొన్నాడు. జయప్రద మాట్లాడుతూ.. మీరు యంగ్ ఏజ్ లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది. ఈ టైంలో ప్రేమ, పెళ్లి గురించి మీ మనసులో ఎలాంటి ఒపీనియన్ ఉంది అని ప్రశ్నించారు.
నేను పెళ్లి చేసుకోబోయే పార్ట్నర్.. అమ్మాయి విషయంలో నాకు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేవు. ఒక గీత గీసుకుని ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అమ్మాయి విషయంలో నేను అంచనాలు పెట్టుకోను. గొడవ జరిగినా ఆ తర్వాత కలసిపోవాలి.. ప్రేమగా ఉండాలి అంతకి మించి ఆలోచించను అని అన్నారు.
ఆ తర్వాత చరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. గత ఏడాది చరణ్, ఉపాసనకు కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే.