MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తనకి ఎదురైన అనుభవం, కూతురికి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న రాంచరణ్.. ఎవ్వరూ ఊహించనిది

తనకి ఎదురైన అనుభవం, కూతురికి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న రాంచరణ్.. ఎవ్వరూ ఊహించనిది

పెళ్లైన పదేళ్లకు పుట్టిన తన ముద్దుల కూతురు క్లింకార గురించి చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 09 2025, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాంచరణ్ నుంచి వస్తున్న చిత్రం ఇది. దీనితో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ చిత్రానికి తిరుగు ఉండకపోవచ్చు. కానీ నార్త్ లో అంత బలంగా ప్రమోషన్స్ చేయలేదు. మరి వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

24

రాంచరణ్ ఇటీవల బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 షోలో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోలో రాంచరణ్ అనేక విషయాలని మనసు విప్పి పంచుకున్నారు. పెళ్లైన పదేళ్లకు పుట్టిన తన ముద్దుల కూతురు క్లింకార గురించి చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. క్లింకార తనని ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడే ప్రపంచానికి పరిచయం చేస్తానని చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె ముఖాన్ని ప్రపంచానికి చూపించలేదు. 

34

క్లింకార ముఖాన్ని చూపించకపోవడానికి బలమైన కారణం ఉందట. రాంచరణ్ మాట్లాడుతూ.. నేను నా బాల్యంలో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. స్కూల్ లో మాత్రమే కాదు ఎక్కడికి వెళ్లినా అందరూ గుర్తుపట్టేవారు. దీనితో ప్రైవసీ ఉండేది కాదు. ప్రైవసీ లేకపోవడం భారంగా అనిపించేది. నా కూతురికి ఆ భారం ఉండకూడదు. నేను నా కూతురికి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ ప్రైవసీ అని రాంచరణ్ తెలిపారు. 

44

ప్రస్తుతం క్లింకార అమ్మ అని పిలవడం ప్రారంభించింది అని చరణ్ తెలిపారు. రాంచరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్య డాకు మహారాజ్ చిత్రం, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna Movies: నాగార్జునే ఒప్పుకున్నాడు.. ఫ్లాప్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయిన 4 సినిమాలు ఇవే
Recommended image2
ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్, నిఖిల్ కొత్త ఇల్లు ఎలా ఉందో తెలుసా?
Recommended image3
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved