Sreeja Konidela: ఒకవైపు రూమర్లు, మరోవైపు చరణ్ తో ముంబైకి.. శ్రీజ ఎమోషనల్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాడు. సడెన్ గా రాంచరణ్ ముంబైకి వెళ్ళాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయింది. శంకర్ దర్శకత్వంలోని చిత్రం తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాడు. సడెన్ గా రాంచరణ్ ముంబైకి వెళ్ళాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయింది. శంకర్ దర్శకత్వంలోని చిత్రం తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. దీనితో కాస్త బ్రేక్ దొరకడంతో చరణ్ తన ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడు.
రాంచరణ్ తన చెల్లి శ్రీజతో కలసి ముంబైకి వెళ్లడం ప్రస్తతం చర్చనీయాంశంగా మారింది. రాంచరణ్ తన సోదరిని చిన్న వెకేషన్ కి తీసుకువెళ్లాడు అని అంటున్నారు. ఇప్పటికే శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి రూమర్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో రాంచరణ్.. శ్రీజని ముంబైకి తీసుకువెళ్లాడు. శ్రీజ మానసిక ప్రశాంతత కోసమే రాంచరణ్ ఆమెని ముంబైకి తీసుకువెళ్లాడని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు శ్రీజ తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రాంచరణ్ తో కలసి సంతోషంగా ఉన్న ఫోటోలని శ్రీజ షేర్ చేసింది.
నేను బతికున్నందుకు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చాలు అంటూ శ్రీజ ఎమోషల్ కామెంట్స్ చేసింది. ఇటీవలే శ్రీజ ఇంస్టాగ్రామ్లో తన పేరు చివర కళ్యాణ్ పేరు తొలగించి కొణిదెల అని మార్చింది. అప్పటి నుంచే రూమర్లు మొదలయ్యాయి.
రాంచరణ్, శ్రీజ ముంబైలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అన్నయ్య చరణ్, పెట్ రైమ్ తో హ్యాపీగా ప్లేన్ లో ఉన్న పిక్స్ ని శ్రీజ షేర్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చెల్లికి ఓ సోదరుడిగా అండగా నిలుస్తున్నందుకు రాంచరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్, RC15 తర్వాత రాంచరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం రాంచరణ్ అభిమానులందరి దృష్టి ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రపైనే ఉంది. ట్రైలర్ లో రాంచరణ్ అల్లూరి పాత్రలో అదిరిపోయే లుక్ లో కనిపించాడు.