- Home
- Entertainment
- మేగజీన్ కోసం అందాల హద్దులు చెరిపేసిన రామ్ చరణ్ హీరోయిన్.. సండే స్పెషల్ నెక్ట్స్ లెవల్..
మేగజీన్ కోసం అందాల హద్దులు చెరిపేసిన రామ్ చరణ్ హీరోయిన్.. సండే స్పెషల్ నెక్ట్స్ లెవల్..
రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి తెలుగు ఆడియెన్స్ కి దగ్గర కాబోతుంది. నార్త్ ని ఊపేస్తున్న ఈ బ్యూటీ సౌత్‌పై కూడా పాగా వేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్‌ని ఊపేస్తుండటం విశేషం.

తెలుగులో మహేష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కియారా. `భరత్ అనే నేను`లో హీరోయిన్‌గా నటించి తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తెలుగులో నటించింది రెండు సినిమాలే అయిన గుర్తిండిపోయేలా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది కియారా. అక్కడ గ్లామర్ డోస్ కూడా పెంచుతూ మరింత హాట్ టాపిక్‌గా మారుతుంది.
లేటెస్ట్ గా ఈ సెక్సీ బ్యూటీ `హలో` అనే మేగజీన్ కోసం రెచ్చిపోయింది. అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్ హాట్ షో చేసింది. మరీ పొదుపైన ట్రెండీ వేర్ ధరించింది కియారా. పీలికల్లాంటి దుస్తులు వేసుకుని ఆల్మోస్ట్ అందాలన్నీ చూపిస్తూ దుమారం రేపుతుంది. ఓ రకంగా అందాల ఆటంబాంబ్ పేల్చినంత పనిచేసింది.
స్క్రీన్‌షోలో హద్దులు చెరిపేస్తూ నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిస్తుంది. సండే స్పెషల్‌గా నెక్ట్స్ లెవల్ అనేలా చాటుకుంటుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మేగజీన్ ఫోటో షూట్ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయంటే అతిశయెక్తి కాదు. అంతగా మెస్మరైజ్ చేస్తున్నాయి.
అయితే ఇటీవల కాలంలో వరుస విజయాలు అందుకోవడం, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం, సోషల్‌మీడియాలో క్రేజ్ బాగా పెరగడం కారణంగా సెప్టెంబర్ నెల మేగజీన్ కవర్ పేజీలో కియారా అద్వానీ గ్లామర్ ఫోటో వేసినట్టు మేగజీన్ ప్రకటించింది. అంతేకాదు బాలీవుడ్ సినిమాకి `గోల్డెన్ గర్ల్` గా వర్ణించడం విశేషం. ఇదిప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది.
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కియారా బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు తరచూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో ఈ జోడీపై బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక కియారా అద్వానీ.. మహేష్‌తో `భరత్ అనే నేను`తో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో కలిసి `వినయ విధేయ రామ`లో నటించింది. బోయపాటి రూపొందించిన ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. ఆ తర్వాత తెలుగుకి దూరమయ్యింది. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇస్తూ చరణ్‌తోనే `ఆర్‌సీ15`లో హీరోయిన్‌గా నటిస్తుంది కియారా. శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
మరోసారి టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు రాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. దీంతో బాలీవుడ్‌లో బిజీ అవుతుంది. అక్కడ కొత్తగా మరో సినిమాని ప్రారంభించుకుంది. కార్తిక్ అర్యాన్ తో కలిసి `సత్య ప్రేమ్ కి కథ` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `గోవింద్ నామ్ మేరా`అనే చిత్రం విడుదలకు రెడీగా ఉంది.