MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #Gamechanger:షేర్ వద్దని, రెమ్యునరేషన్ సెటిల్ చేసుకున్న చరణ్, కారణం ఏంటంటే

#Gamechanger:షేర్ వద్దని, రెమ్యునరేషన్ సెటిల్ చేసుకున్న చరణ్, కారణం ఏంటంటే

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకునే చరణ్‌..  ఈ చిత్రానికి భారీగానే కోట్ చేసారట. 

4 Min read
Surya Prakash
Published : Jul 14 2024, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Game Changer

Game Changer

తన రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్(Game changer)పై ఫ్యాన్స్ కన్నా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. అందుకే మొదట ఇచ్చిన డేట్స్ క్లాష్ అయినా, ఎక్కువ రోజులు బల్క్ గా మళ్లీ కేటాయించాల్సి వస్తున్నా, బడ్జెట్ పెరిగిపోతూ వస్తున్నా, షూటింగ్ డేస్ పెరిగిపోయినా రామ్ చరణ్ ఎక్కడా తొణకకుండా శంకర్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తన నుంచి వచ్చే సినిమాకు గ్లోబుల్ గా సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ సైతం త్యాగం చేసినట్లు తెలుస్తోంది.

213

'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్' కావటంతో అంచనాలు బాగా ఉన్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అస్సలు క్లారిటి లేదు. అయితే ఈ ఏడాది అక్టోబరులోనే ఉండొచ్చని దిల్ రాజు కూతురు తాజాగా రివీల్ చేసింది. ఇకపోతే ఈ మూవీలో చేస్తున్నందుకు గానూ చరణ్ మొదట షేర్ తీసుకుందామనుకున్నారట.
 

313

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకునే చరణ్‌..  ఈ చిత్రానికి భారీగానే కోట్ చేసారట. అయితే దిల్ రాజు ఓ ప్రపోజల్ పెట్టారట. నిర్మాతగా తను, హీరో, డైరక్టర్ ముగ్గరూ 33% చొప్పున సమానంగా షేర్ బిజినెస్ నుంచి తీసుకుందామనుకున్నారు. ఈ బిజినెస్ లో థియేటర్, డిజిటల్, శాటిల్, మిగతా అన్ని రైట్స్ ఉంటాయి. ఇలా చేయటం వల్ల శంకర్ కు, హీరో రామ్ చరణ్ కు ఇమ్మీడియట్ గా రెమ్యునరేషన్ లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ డబ్బుని సినిమాలో పెట్టుబడిగా పెట్టవచ్చు అనుకున్నారు.
 

413

అయితే షూటింగ్ లేటు అవటంతో బడ్జెట్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. 250 కోట్లు బడ్జెట్ అనుకున్న ఈ ప్రాజెక్టు 400 కోట్ల మార్క్  ని రీచ్ అయ్యిందని తెలుస్తోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ తన తరుపు నుంచి నిర్మాతకు సాయిం చేయాలని నిర్ణయించుకున్నారట. తను మొదట అనుకున్న షేర్ లాగ కాకుండా ఇంత ని ఎమౌంట్ తన రెమ్యునరేషన్ గా తీసుకుంటానని చెప్పారట. 

513

దాంతో  తన రెమ్యునరేషన్ గా  రూ.90 కోట్ల పారితోషికం చరణ్ అందుకుంటున్నాడట. అదే షేర్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా 15 నుంచి 20 కోట్లు ఎగస్ట్రా లాభం వచ్చేది అంటున్నారు. అయినా పెరిగిన బడ్జెట్, పెట్టుబడి వడ్డీలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని నిర్మాతకు మేలు చేసాడంటున్నారు. ఈ రకంగా ఎగ్రిమెంట్ ని తిరిగి రాసారంటున్నారు.  దాంతో దిల్ రాజు చాలా ఆనందపడ్డారని అంటున్నారు. బిజినెస్ ఓపెన్ అయ్యాక ఓ రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు.    
 

613

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ముఖ్యంగా కథ బిల్డ్ అయ్యేది  తండ్రి పాత్ర నుంచే.  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ప్లాన్ చేసారట.  ఈ పాత్ర గెటప్, నటన  కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ పాత్రతో చరణ్ కు నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదని, ఆ స్దాయిలో పాత్రను డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. 

713

ఇక తండ్రిగా కనిపించే రామ్ చరణ్ పాత్ర పేరు అప్పన్న అని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఏళ్ల క్రితం కనిపించే పంచకట్టుతో కనిపిస్తుందట ఈ పాత్ర. పొలిటికల్ లీడర్ గా కనిపంచే ఈ పాత్రలో రామ్ చరణ్ కు  నత్తి సమస్య ఉంటుందట. అదే ఈ పాత్రకు హైలెట్ కానుందని సమాచారం. ఇక ఎలక్షన్స్  లో  నిలబడ్డ అప్పన్న పాత్ర కొన్ని కుట్రలకు బలైపోతాడు. అదే కొడుకు రామ్ చరణ్ మనస్సులో నాటుకుపోతుందిట. తండ్రి రామ్ చరణ్ కు జంటగా అంజలి కనిపించనుందిట.
 

813

కొడుకు పాత్ర పేరు రామ్ నందన్. అతను ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవుతాడు. తన తండ్రి జరిగిన అన్యాయానికి అతను చట్టం పరిధిలోనే ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు. తన తండ్రి రాజకీయుకుడుగా జనాలకు చేద్దామనుకున్న పనులును తను ఎలా చేసాడు. చట్టంలో ఉన్న లొసుగులు వలన ఎలా సామాన్యులు ఇబ్బంది పడతారు. ఎలాంటి మార్పులు చట్టంలో చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది వంటి విషయాలు సినిమాలో చూపిస్తారని అంటున్నారు.
 

913

ఈ సినిమా పూర్తిగా తండ్రి ఆశయాన్ని తీరుస్తూ, అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పక్కా రివేంజ్ స్టోరీతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే రివేంజ్ స్టోరీ అని,శంకర్ మార్కు ఎలిమెంట్స్ తో సినిమా నడుస్తుందని కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఫార్ములా స్టోరీ అని చెప్తున్నారు. ఏదైమైనా అప్పన్నగా రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నామన్నమాట.  
 

1013

గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసి నిర్మాత దిల్ రాజు ఆ డేట్ కన్ఫమ్ చేసినట్లు చెప్తున్నారు. ప్రభాస్ ‘సలార్’ సైతం క్రిస్మస్ శెలవులను ఫెరఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అదే రూట్ లో రాబోతోంది.   
 

1113

ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.
 

1213
game changer

game changer

  రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   
 

1313
game changer

game changer

దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. 'RC16' వర్కింగ్ టైటిల్‌. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం చరణ్‌కి ఏకంగా రూ.125 కోట్ల మేర పారితోషికం ఇవ్వబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో చరణ్ ఒకడు అవుతాడు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved