MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • షాకింగ్: ‘గేమ్‌ ఛేంజర్‌’బిజినెస్ ట్విస్ట్..భారీ డీల్ కాన్సిల్?రీజన్ ఏంటంటే

షాకింగ్: ‘గేమ్‌ ఛేంజర్‌’బిజినెస్ ట్విస్ట్..భారీ డీల్ కాన్సిల్?రీజన్ ఏంటంటే

 Zee Studiosవారు గేమ్ ఛేంజర్ వరల్డ్ రైట్స్ గతంలో తీసుకుని ఉన్నారు. ఇప్పుడు డీల్ కాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది.

4 Min read
Author : Surya Prakash
Published : Apr 17 2024, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Game Changer

Game Changer


పెద్ద సినిమాల బిజినెస్ విషయంలో రకరకాల విన్యాసాలు చోటు చేసుకుంటాయి. డీల్ కన్ఫర్మ్ అయ్యి అడ్వాన్స్ చేతిలో పడ్డాక కూడా చేతులు మారిపోతూంటాయి. రాత్రికి రాత్రి ఎగ్రిమెంట్స్ కాన్సిల్ చేసుకుంటూంటారు. అన్ని రోజు రోజుకీ మారిపోతున్న లెక్కలు ని బట్టే  డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ విషయంలో కూడా అలాంటి డీలే ఒకటి కాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాలో  ఓ కథనం వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Game Changer Movie

Game Changer Movie


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్  పై ఏ రేంజి అంచనాలు ఉన్నాయో తెలిసిందే.   రామ్‌  చరణ్‌ క్రేజ్ కు తగ్గ మరో పాన్‌ ఇండియా చిత్రమిది.  రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ సైతం జరుగుతోంది. ముంబైకి చెందిన జీ స్టూడియోస్ Zee Studiosవారు గేమ్ ఛేంజర్ వరల్డ్ రైట్స్ గతంలో తీసుకుని ఉన్నారు. ఇప్పుడు డీల్ కాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది.

 

312
Game Changer 2

Game Changer 2


జీ స్టూడియో వారు ఈ రైట్స్ ని దాదాపు 350  కోట్ల పైగా వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకోవటానికి ఎగ్రిమెంట్  చేసినట్లు చెబుతున్నారు. అయితే బడ్జెట్ పెరిగిపోవటంతో ఆ రేటు గిట్టుబాటు కాదని 400 కోట్లు దాకా అయితేనే ఇవ్వమని నిర్మాత దిల్ రాజు చెప్పటంతో వాళ్లు తమ సంస్ద అంత పెట్టుబడి పెట్టదంటూ వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. రెండేళ్లగా నడుస్తున్న ఈ ప్రాజెక్టుపై మొదట అనుకున్న అంకెకు మించి పెట్టడానికి జీ వారు సిద్దంగా లేరట. దాంతో వద్దనుకున్నట్లున్నారని ముంబై నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. 

412


జీ స్టూడియోస్ వారు ప్రక్కకు తప్పుకోవటంతో దిల్ రాజు స్వయంగా ఈ సినిమా బిజినెస్ చేస్తున్నారట. ఏరియావైజ్ అమ్మకాలు మొదలెట్టినట్లు సమాచారం. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ అండ్ టైటిల్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ కాకున్నా.. ఈ సినిమాకి ఓ  రేంజ్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. అయితే కొంతమంది.. చరణ్ అండ్ శంకర్ కి ఉన్న మార్కెట్ కి ఈ రేంజ్ రేట్ పలకడం పెద్ద ఆశ్చర్యం కాదని కామెంట్స్ చేస్తున్నారు.

512


మరో ప్రక్క  ఈ చిత్రం ఓటిటి రైట్స్ లాక్ చేసారు. ఓటిటి జెయింట్ Amazon Prime ఈ చిత్రం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ మొత్తం సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రం మరో లీడింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్  Zee5 వారికే ఉన్నాయంటున్నారు.  డిజిటిల్  రైట్స్ నిమిత్తం అమేజాన్ వారు 105 కోట్లు పే చేసారని తెలుస్తోంది. జీ 5 ఎంత పే చేసారనేది మాత్రం తెలియరాలేదు.

612
Game changer

Game changer


 శంకర్, రామ్ చరణ్ కాంబో కావటంతో ఈ రేటు పలికింది. శంకర్ కు తమిళంలో ఉన్న మార్కెట్ ప్లస్ కానుంది. అలాగే రామ్ చరణ్ ..తన ఆర్ .ఆర్.ఆర్ చిత్రంతో హిందీలోనూ జెండా పాతారు. దాంతో అక్కడ మార్కెట్ కూడా యాడ్ అయ్యింది. ఈ క్రమంలో ఓటిటి ద్వారానే భారీగా నిర్మాత దిల్ రాజు రికవరీ తెచ్చుకోనున్నారు. 

712


ఇక  ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట. 

812


  చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన  టి. ఎన్. శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని ఈ కథ చేసినట్లు వినిపిస్తోంది. దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందారు. ‘ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు’ అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ శేషన్ మాత్రం దానిని ఆచరించి చూపించారు.

912
Game changer

Game changer


 
రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.

1012
Game changer

Game changer


వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.

1112


 తండ్రీ, కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్  ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2021 లో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుండి కేవలం టైటిల్ గ్లింప్స్, రీసెంట్ గా సాంగ్  తప్ప ఎటువంటి అప్ డేట్ లేదు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
  

1212

గేమ్ ఛేంజర్ సినిమా ఓ IAS ఆఫీసర్ కి, అవినీతి రాజకీయనాయకులకు మధ్య జరిగే కథ అని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు కానీ సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజయ్యే అవకాశం ఉంది. ముంబైలో జరిగిన అమెజాన్ ఈవెంట్లో దిల్ రాజు పాల్గొన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ లోకి రాబోతుందని ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved