రామ్ చరణ్ క్రేజ్ చూసి, అజిత్, విక్రమ్ కూడా ప్రక్కకు తప్పుకుంటున్నారే
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాతో పోటీ పడటం ఇష్టం లేక ఇతర సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నట్లు సమాచారం.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ప్యాన్ ఇండియా మార్కెట్ మొదలయ్యాక తమిళ, తెలుగు స్టార్స్ తమ రిలీజ్ లు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రక్క రాష్ట్రాల్లో రిలీజ్ డేట్స్ ని పరిశీలించుకుని మరీ రిలీజ్ క్యాలెండర్ ని రూపొందించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పెద్ద బడ్జెట్ సినిమాలు మరీ జాగ్రత్తలు తీసుకుని మార్కెట్ లోకి దిగుతున్నారు.
దానికి తోడు ఓటిటి సంస్దలు కూడా ఇష్టం వచ్చిన సమయంలో రిలీజ్ చేస్తే వాళ్లు అడిగిన రేట్లు ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నాయి. దాంతో ఓ ప్రక్కన తోటి స్టార్స్ సినిమాలతో క్లాష్ తప్పించుకుంటేనే తమ మార్కెట్ ని విస్తృత పరుచుకోవాలనుకుంటున్నారు. ఈ సారి సంక్రాతికి అన్ని జాగ్రత్తలతో తమిళ, తెలుగు సినిమాలు డేట్స్ ప్రకటించుకుంటున్నాయి.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ . ఈ సినిమా జనవరి 10, 2025న సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజిలో హంగామా చేసి రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో కానీ ప్రస్తుతానికి మాత్రం రిలీజ్ డేట్స్ మార్చుకునే సిట్యువేషన్ పరిస్దితి తీసుకువస్తోంది.
కేవలం తెలుగులో సినిమాలు మాత్రమే గేమ్ ఛేంజర్ దెబ్బకు ప్రక్కకు తప్పుకోవటమే కాకుండా తమిళ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ని విడుదల షెడ్యూల్‌లను పునఃపరిశీలించవలసి ఉంటోందని వార్తలు వస్తోంది.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
రోబో, అపరిచితుడు వంటి హిట్ చిత్రాలకు దుమ్ము రేపిన శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులలోనూ ఖచ్చితంగా చూడాలనే కోరికను పుట్టిస్తోంది. దాంతో కొంతమంది తమిళ చిత్రనిర్మాతలు తమ రిలీజ్ ప్లాన్ లను ను ఎడ్జెస్ట్ చేసుకుంటున్నారు.
అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ...రామ్ చరణ్, శంకర్ కొలాబిరేషన్ అంటే ఖచ్చితంగా మార్కెట్ ని గ్రాబ్ చేసే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ టైమ్ లో ఆ సినిమాతో పోటీపడితే రెవిన్యూలు తగ్గుతాయని తమిళ స్టార్స్ కు తెలుసు. అందుకే వెనక్కి తగ్గి దారి ఇస్తున్నారు అన్నారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతికి ప్లాన్ చేసారు. కానీ దాన్ని ఇప్పుడు ఏప్రియల్ లేదా మే కు మారే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇక విక్రమ్ నటించిన వీర ధీర శూర చిత్రం కూడా సోలో రిలీజ్ కోసం పోటీ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. ఇలా చిన్నా, పెద్ద సినిమాలు అన్ని శంకర్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు దారి ఇచ్చి తప్పుకుంటున్నాయి.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). ఈ సినిమా పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. దర్శకుడు శంకర్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ కు ఇది లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లాంటింది. దాంతో ఈ చిత్రం ఖచ్చితంగా భారీ సక్సెస్ అవుతుందని భావించి, బిజినెస్ డీల్స్ భారీగా జరుగుతున్నాయి.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ కలిపి ₹150 కోట్ల వరకూ అంచనా. ఆంధ్రా నుంచి ₹70, సీడెడ్ నుంచి ₹25 కోట్లు, నైజాం ఉజ్జాయింపుగా ₹55 కోట్లు అని తెలుస్తోంది. ఈ సినిమా చుట్టూ క్రేజ్ మెల్లిగా పుంజుకుంటోంది.
దీపావళికి వచ్చే టీజర్ తో సినిమాకు క్రేజ్ రెట్టింపు అవుతోందని భావిస్తున్నారు. టీజర్ బాగా రిసీవ్ చేసుకుంటే ఎక్సపెక్టేషన్స్ పెరిగి, బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ప్రమోషన్స్ బాగా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.