కాజల్ అగర్వాల్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. ఇంతకీ ఏమంటున్నారంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) పట్ల ఆమె అభిమానులతో పాటు చెర్రీ ఫ్యాన్స్ కూడా కాస్తా గరంగా ఉన్నారు. పెళ్లి తర్వాత సరిగా సినిమాల్లో కనిపించకపోవడంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సౌత్ స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ వెలుగొందింది. తెలుగు, తమిళం, అటు హిందీలోనూ స్టార్ హీరోల సరసన నటించి తన సత్తా చూపించింది. వరుస హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకొని సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ కాస్తా సినిమాల జోరు తగ్గించింది.
ఒకవైపు యంగ్ హీరోయిన్లు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ జోరు పెంచుతుంటే కాజల్ లాంటి సీనియర్ మరియు అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లు మాత్రం పెద్ద చిత్రాల్లో కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా కాజల్ గత మూడేండ్లుగా అసలు తెలుగు చిత్రాల్లో కనిపించడమే లేదు.
ఏదో నామమాత్రంగానే ఒకటి, రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఇందుకూ ఓ కారణంగా ఉందని చెప్పాలి. 2020లో ముంబయికి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu)ను కాజల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సినిమాల జోరును తగ్గించింది.
ఆ వెంటనే తను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసింది. ఇటీవలె పండంటి బిడ్డకు జన్మిచ్చింది కాజల్. అయితే తన పెళ్లి అయినప్పటి నుంచి కాజల్ సరిగా ఎలాంటి చిత్రాలకు ఒకే చెప్పడం లేదు. గతంలో ఒకే చేసిన చిత్రాల్లోనే నటించిన కామ్ గా ఉంటోంది. కానీ పలు ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్లు మాత్రం చేసింది.
చివరిగా మెగా స్టార్ చిరంజీవి నటించి ‘ఆచార్య’ (Acharya)తో నటిస్తుందని వార్తలు వచ్చినా.. సినిమాలో మాత్రం కాజల్ కనిపించలేదు. అప్పటికే తను ప్రెగ్నెన్సీతో ఉండటం అందుకు కారణంగా తెలిసింది. మొత్తంగా మూడు నాలుగేండ్ల నుంచి కాజల్ నుంచి గట్టి సినిమాలేవీ రావడం లేదు. దీంతో ఆమె అభిమానులు చాలా అప్సెట్ అవుతున్నారు. కమ్ బ్యాక్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఆమె అభిమానులేకాకుండా.. ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కాజల్ రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి తర్వాత అసలు సినిమాలు చేస్తుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా చెర్రీ ఫ్యాన్ ఒకరు కాజల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘యాడ్ ఫిల్మ్స్ తప్పా.. సినిమాలేవంటూ’ ట్వీటర్ వేదికన కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. మొత్తంగా కాజల్ రీఎంట్రీని అభిమానులు, నెటిజన్లు కూడా గట్టిగా కోరుకుంటున్నారు.