రామ్ చరణ్ కొత్త వ్యాపారం, మహేష్,అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్న గ్లోబల్ స్టార్
స్టార్ హీరోగా కొనసాగుతూ... ఇప్పటికే రకరకాల వ్యాపారాల్లో చేయి వేసిన మెగా పవర్ స్టర్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ త్వరలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయంలో భావ అల్లు అర్జున్ ను ఫాల్ అవుతున్నాడట చరణ్ బాబు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రామ్ చరణ్ గ్లామర్, యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాడు. ఇక తన నటనతోనే కాదు, వ్యాపార రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్న మెగా హీరో తాజాగా మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ బిజినెస్ విషయంలో చరణ్ అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్నట్టు సమాచారం.
KNOW
తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ "ARC Cinemas" పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు (AMB Cinemas), అల్లు అర్జున్ (AAA Cinemas), రవితేజ (RT Cinemas/ART), విజయ్ దేవరకొండ (AVD Cinemas) వంటి టాలీవుడ్ స్టార్‌లు థియేటర్ బిజినెస్‌లోకి ప్రవేశించారు. వీరంతా ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్లను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం.
చెర్రీ కొత్తగా ప్రారంభించనున్న ARC Cinemas కూడా ఏషియన్ సునీల్ గ్రూప్‌తో కలిసి స్థాపించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ, త్వరలో స్థలం , ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మల్టీప్లెక్స్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి ప్రధాన నగరాల్లోనా లేక మెట్రో సిటీ హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటవుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే బన్నీ తరహాలో చెర్రీ కూడా విశాఖపట్నంను టార్గెట్ చేసినట్టు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పెద్ది" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2026 మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆలస్యం అయినప్పటికీ, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రతి రోజు షూట్ చేసిన దృశ్యాలను వెంటనే ఎడిట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తిచేస్తున్నారు.