సోషల్ మీడియాలో అకౌంట్ లేని స్టార్ హీరో ఎవరో తెలుసా?
ప్రస్తుతం స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి ఇండియన్ సూపర్ స్టార్స్ వరకూ అందరు సోషల్ మీడియా అకౌట్స్ ను కలిగి ఉంటున్నారు. కానిఓ స్టార్ హీరో మాత్రం ఇంత వరకూ ఒక్క సోషల్ మీడియా అకౌంట్ ను కూడా వాడటం లేదు. ఇంతకీ ఎవరా హీరో?

ప్రపంచం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో కొనసాగుతోంది. చిన్న పిల్లల నుంచీ పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల విషయానికి వస్తే, వారి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే, ఈ క్రమంలో ఒక స్టార్ హీరో మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఏ ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కూడా అకౌంట్ లేదు. ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రణబీర్ తన సినిమాలకు సంబంధించిన సమాచారం కూడా స్వయంగా షేర్ చేయరు. ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ను ప్రొడక్షన్ కంపెనీలు లేదా ఫ్యాన్స్ పేజీలు మాత్రమే షేర్ చేస్తుంటాయి. ఆయన నుంచి మాత్రం ఏ పోస్టూ బయటకు రాదు. సోషల్ మీడియా యుగంలో ఒక టాప్ హీరో ఇలా దూరంగా ఉండటం చాలా అరుదుగా కనిపించే విషయమే.
ఈ క్రమంలో రణబీర్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న "రామాయణ" సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి ‘సీత’గా నటిస్తుండగా, కన్నడ రాక్‌స్టార్ యష్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణంలో ఉంది
రామాయణాన్ని ఆధునిక టెక్నాలజీతో తెరకెక్కించే ప్రయత్నంలో మూవీ టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. 2026లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశముంది.రణబీర్ సోషల్ మీడియా దూరంగా ఉన్నప్పటికీ, ఆయన సినిమా అప్‌డేట్స్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.