రామ్ చరణ్ నెంబర్ ను ఉపాసన ఫోన్ లో ఏ పేరుతో సేవ్ చేసుకుందో తెలుసా? షాక్ అవుతారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ నెంబర్ ను, ఆయన భార్య ఉపాసన తన ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? అసలు ఆ పేరుతో సేవ్ చేయడానికి కారణం ఏంటి? ఈ విషయంలో ఉపాసన ఏం చెప్పిందంటే?

సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని ఆసక్తి
సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరంగానే ఉంటుంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల స్టైల్స్, డ్రెస్ లు, ఆహారపు అలవాట్లు, వాడుతున్న ఫోన్లు, కార్లు, ఫోన్లలో ఏ వాల్ పేపర్లు వాడతారు, సెలబ్రిటీల పేర్లను ఎలా సేవ్ చేసుకుంటారు వంటి విషయాలు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. ఈ విషయాలను ఎవరైనా స్టార్స్ ఏదైనా ఇంటర్వ్యలో చెపితే వినడానికి ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా మెగా కోడలు ఉపాసన కొనిదెల ఓ ఇంటర్వ్యూలో తన భర్త రామ్ చరణ్ గురించి చెప్పిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
KNOW
టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్
టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో రామ్ చరణ్ ఉపాసన పేర్లు ముందుంటాయి. వీరిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కూల్ డేస్ నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడం, ఆతరువాత అది ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడంలో వారు సక్సెస్ అయ్యారు. ఆరువాత వారి జీవితాన్ని ఓ క్రమశిక్షణతో గడుపుతున్నారు ఇద్దరు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ.. ఫ్యామిలీ లైప్ లో కూడా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక పెళ్లి తరువాత 10 ఏళ్లకు వీరికి ఒక పాప జన్మించింది. 2023లో పుట్టిన తమ కుమార్తె క్లింకారతో ప్రస్తుతం మెమరబుల్ ఫేజ్‌ని ఆస్వాదిస్తున్నారు ఈజంట.
రామ్ చరణ్ కు ఉపాసన పెట్టిన పేరు
ఈక్రమంలోనే ఎన్నో సందర్భాల్లో ఇద్దరు తారలు ఇంటర్వ్యూల ద్వారా తమ గురించి ఎన్నో విషయాలు వెల్లడించడం తెలిసిందే. ఈక్రమంలోన ఉపాసన కూడా ఒక సందర్భంలో ఓ వ్యక్తిగత విషయం అభిమానులతో పంచుకుంది.ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ, తాను తన భర్త రామ్ చరణ్ ఫోన్ నంబరును తన మొబైల్‌లో ఎలా సేవ్ చేసుకున్నది వెల్లడించారు. ఆయన పేరును ''Ram Charan 200” గా ఉపాసన సేవ్ చేసుకున్నట్టు చెప్పింది. ఇంతకీ ఆ 200 అనే సంఖ్యకు అర్థమేంటో అని ఫ్యాన్స్ కు ఆలోచనలోపడగా.. దానికి కూడా కరాణాని ఆమె వెల్లడించింది.
అసలు కారణం వెల్లడించిన ఉపాసన
రామ్ చరణ్ పేరు అలా సేవ్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. చరణ్ ఇప్పటి వరకు 199 సిమ్ కార్డులు మార్చారు. ఇది 200వ సిమ్. అందుకే ఆయన్ను నా ఫోన్‌లో ‘Ram Charan 200’గా సేవ్ చేసుకున్నాను,” అంటూ అసలు విషాయాన్ని నవ్వుతూ వెల్లడించారు ఉపాసన. ఈ విషయం తెలిసి అభిమానులను కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు అన్ని సిమ్ములు ఎందుకు మార్చాడబ్బా అని ఆలోచనలో పడ్డారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ ఎందుకు ఇంతగా సిమ్‌లు మారుస్తారు అన్నది అర్థం కాకపోయినా, ఉపాసన సరదా వివరణ మాత్రం ఆసక్తికరంగా మారింది.
రామ్ చరణ్ సినిమాలు
ఇక రామ్ చరణ్ – ఉపాసనలు తమ పనులతో ఎంత బిజీగా ఉన్నా కానీ.. తమ కూతురు క్లింకారతో వ్యక్తిగత జీవితాన్ని బాగా బలాన్స్ చేస్తూ, సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కాని, ఫ్యామిలీ మూమెంట్స్ ను మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన బుచ్చిబాబు తో పెద్ది సినిమా బిజీలో ఉన్నాడు. సుకుమార్ కథ అందించిన ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆతరువాత సుకుమార్ తోనే ఆయన సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.