- Home
- Entertainment
- Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?
రాంచరణ్ తన కెరీర్ లో 2 సార్లు అతి పెద్ద మిస్టేక్స్ చేశారు. రెండు చిత్రాల విషయంలో చరణ్ తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

రాంచరణ్ కథల ఎంపిక
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ బిగినింగ్ నుంచి తన కథల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో రాంచరణ్ కొన్ని చెత్త కథలని ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి.. రాంచరణ్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. మగధీర తర్వాత రాంచరణ్ వద్దకు నిర్మాత దిల్ రాజు జోష్ కథని తీసుకువచ్చారు.
రాంచరణ్ చేసిన మిస్టేక్స్
మగధీర తర్వాత చరణ్ ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదని చిరంజీవి వద్దని చెప్పారు. దీనితో ఆ మూవీ నాగ చైతన్య చేతుల్లోకి వెళ్ళింది. జోష్ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే రాంచరణ్ తన కెరీర్ లో చేసిన అతిపెద్ద కాస్ట్లీ మిస్టేక్స్ 2 ఉన్నాయి. అందులో మొదటిది శ్రీమంతుడు చిత్రాన్ని రిజెక్ట్ చేయడం.
140 కోట్ల సినిమాని రిజెక్ట్ చేసిన చరణ్
డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు కథని ముందుగా రాంచరణ్ కి వివరించారు. అయితే చరణ్ కథలో కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులు చేస్తుంటే కథ వర్కౌట్ కావడం లేదని చరణ్ శ్రీమంతుడు కథని పక్కన పెట్టేశారు. కొరటాల శివ అదే కథని మహేష్ బాబుతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. శ్రీమంతుడు చిత్రం ఏకంగా 140 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది.
అదే డైరెక్టర్ చెప్పిన చెత్త కథకి ఒకే
రాంచరణ్ RRR తర్వాత ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో నటించారు. కొరటాల శివ చెప్పిన శ్రీమంతుడు లాంటి అద్భుతమైన కథని రిజెక్ట్ చేసిన చరణ్.. అదే డైరెక్టర్ తీసుకువచ్చిన ఆచార్య లాంటి చెత్త కథని ఓకె చేశారు. చిరంజీవి కూడా ఆచార్య కథని బ్లైండ్ గా నమ్మేసినట్లు ఉన్నారు. అందుకే చిరంజీవి కూడా ఏమీ చేయలేకపోయారు.
గేమ్ ఛేంజర్ కూడా..
ఫలితంగా ఆచార్య చిరంజీవి, రాంచరణ్ ఇద్దరికీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా రాంచరణ్ మరో మిస్టేక్ చేశారు. డైరెక్టర్ శంకర్ ని గుడ్డిగా నమ్మేసి గేమ్ ఛేంజర్ మూవీ చేశారు. శంకర్ నాన్చుతూ తీసిన గేమ్ ఛేంజర్ ఊహించని డిజాస్టర్ గా మారింది. నిర్మాత దిల్ రాజుకి తీవ్ర నష్టాలు మిగిల్చింది.

