MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: రామరాజు అగ్గిపిడుగులా ఎలా మారాడంటే.. RRRలో ఈ సీన్ పడుంటే..

Ram Charan: రామరాజు అగ్గిపిడుగులా ఎలా మారాడంటే.. RRRలో ఈ సీన్ పడుంటే..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 23 2022, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాంచరణ్, ఎన్టీఆర్ లని జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పట్టారు. 

26

ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రానికి అప్లాజ్ లభిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్స్ లో రిలీజైనప్పుడు చాలా మంది హాలీవుడ్ వాళ్ళు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ఓటిటిలోకి కూడా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం నాన్ ఇంగ్లీష్ మూవీగా అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క విదేశీయులు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. 

36

దాదాపు 3 గంటల నిడివి ఉండే ఈ చిత్రం చూస్తుంటే సమయమే తెలియడం లేదు అని అంటున్నారు. రాజమౌళి ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలు డిలీట్ చేశారు. షూట్ చేసిన మొత్తం సీన్స్ పెడితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోతుంది. దీనితో జక్కన్న కొన్ని సీన్స్ లేపేశారు. 

46

అందులో రాంచరణ్ రామరాజుగా జన్మించే సీన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ బయటకి వచ్చింది. రామరాజు జన్మించిన తర్వాత వేదపండితులు నామకరణం చేసే సన్నివేశం కావచ్చు అది. బ్యాగ్రౌండ్ లో ఫైర్ కనిపిస్తుండగా వేద పండితులు బేబీ రామరాజుని ఆశీర్వదిస్తారు. 

56

ఆ ఆశీర్వాద బలంతో రామరాజు అగ్గి పిడుగులా రెచ్చిపోయే వీరుడు అవుతాడు. ఈ సీన్ ని రాజమౌళి సినిమా నిడివి దృష్ట్యా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది కనుక ఉంది ఉంటే చరణ్ రామరాజు పాత్ర ఇంకా బాగా ఎలివేట్ అయి ఉండేదని అభిమానులు అంటున్నారు. 

66

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Recommended image2
Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో
Recommended image3
Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved